18 April, 2026 | 3:59 PM

Breaking News

మహిళా రిజర్వేషన్ల పట్ల కాంగ్రెస్ పార్టీ ది వక్రబుద్ధి   •   ఇందిరా క్రాంతి వివోఏలకు ఉద్యమం రిజిస్ట్రేషన్ పై అవగాహన   •   మినీ గురుకులంలో ప్రవేశానికి దరఖాస్తుల స్వీకరణ   •   మైనార్టీ గురుకుల ప్రిన్సిపాల్ పై చర్యలు తీసుకోవాలి   •   ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కేంద్రం గుడ్‌న్యూస్‌... DA పెంపు   •   హార్ముజ్ జలసంధి మళ్లీ బంద్‌ — ట్రంప్‌కు దిమ్మతిరిగే షాక్— ఇరాన్ సంచలన ప్రకటన   •   రాత్రి 8:30 గంటలకు జాతినుద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం   •   మహిళా బిల్లు వీగిపోవడం— బీజేపీ విధానాల ఓటమి   •   దేశ మహిళలకు అన్యాయం.. కాంగ్రెస్, బీజేపీ‎ల‎పై హరీశ్‎రావు కీలక వ్యాఖ్యలు   •   వర్క్ షాప్ కోసం అనుమతి ఇవ్వండి   •  

లైసెన్సుడ్ సర్వేయర్ల శిక్షణా తరగతులు

27-05-2025 12:00 AM

ప్రారంభించిన కలెక్టర్ జితేష్ వీ పాటిల్

భద్రాద్రి కొత్తగూడెం మే 26 (విజయక్రాంతి)ప్రభుత్వ కొత్త బోర్ రికార్డుల చట్టాన్ని సక్రమంగా అమలు చేయాలనే లక్ష్యంతోనే శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ జితేష్ పాటిల్ తెలిపారు.కొత్తగూడెం యూనివర్సిటీ ఆఫ్ మైనింగ్ కళాశాలలో ఏర్పాటుచేసిన లైసెన్సు సర్వేయర్ల శిక్షణ కార్యక్రమాన్ని సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భూ భారతి చట్టం లో రిజిస్ట్రేషన్ల ప్రక్రియకు భూమి సర్వే చేయడం కోసం లైసెన్స్ సర్వేయర్లగా ఎంపికైన 426 మంది అభ్యర్థులకు సోమవారం నుండి శిక్షణ తరగతులు నిర్వహించడం జరుగు తుందన్నారు.

ఎంపికైన అభ్యర్థులు శిక్షణను సద్వినియోగం చేసుకొని రాణించాలన్నా రు. అభ్యర్థులకు మొత్తం 50 రోజుల పని దినాల్లో శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. శిక్షణలో భాగంగా అభ్యర్థులను రెండు బ్యాచులుగా విభజించి ఉదయం థియరీ తరగతులు , మధ్యాహ్నం క్షేత్రస్థాయికి తీసుకువెళ్లి సర్వేపై శిక్షణ ఇస్తారన్నారు. శిక్షణ తరగతులకు హాజరైన అభ్యర్థుల విద్యా అర్హతకు సంబంధించిన ఒరిజినల్ సర్టిఫికెట్లను ప్రత్యేక కౌంటర్ల ద్వారా పరిశీలించారు.

అనంతరం కలెక్టర్ అభ్యర్థులకు సర్వేకు సంబంధించిన గొలుసులు, క్రాస్ స్టాప్, క్యాలిక్యులేటర్, స్కేల్, పెన్సిల్, నోట్ బుక్స్ తో పాటు స్టడీ మెటీరియల్ కు సంబంధించిన కిట్లను అందించారు. శిక్షణ పూర్తయిన అనంతరం శిక్షణ పొందిన సర్వేయర్లకు లైసెన్సులు జారీ చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా మైనింగ్ కళాశాల ఏడి శ్రీనివాస్, ఇన్స్పెక్టర్ డి. శ్రీనివాస్ ,మైనింగ్ కళాశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.