భార్య గర్భాన్ని చీల్చిన భర్తకు జీవిత ఖైదు
ఉత్తరప్రదేశ్, మే 24 : పుట్టబోయేది ఆడబిడ్డో, మగబిడ్డో తెలుసుకునేందుకు సైకోలా ప్రవర్తించిన భర్తకు జీవిత ఖైదు విధిస్తూ ఉత్తరప్రదేశ్‌లోని బుదౌన్ జిల్లా కోర్టు తీర్పు వెలువరించింది. యూపీలో జరిగిన ఈ దారుణ ఘటనలో భర్త రాక్షస చర్యల పట్ల అదనపు జిల్లా సెషన్స్ జడ్జి సౌరభ్ శుక్రవారం తీర్పు వెల్లడించారు. నిందితుడికి జీవిత ఖైదు విధిస్తూ తీర్పునిచ్చారు. 2020 సెప్టెంబర్‌లో చోటుచేసుకున్న ఈ ఘటన అప్పట్లో పెను సంచలనంగా మారింది. బదౌన్ సివిల్ లైన్స్‌లో నివాసం ఉంటున్న పన్ను లాల్, అనిత దంపతులకు ఘటన జరిగే సమయానికి వివాహమై 22 ఏళ్లు అయింది. వారికి అప్పటికే ఐదుగురు కుమార్తెలు ఉన్నారు. మరోసారి గర్బం దాల్చిన తన భార్యతో మగబిడ్డను కనకుంటే విడాకు లిచ్చి మరో మహి ళను వివాహం చేసుకుంటానని బెదిరించేవాడు.
ఈ క్రమంలో తన భార్య పొట్టలో ఉన్నది ఆడబిడ్డనా, మగబిడ్డనా తెలుసుకునేందుకు కొడవలితో తన భార్య గర్భాన్ని చీల్చాడు. ఈ ఘటనలో కొడవలి కడుపు లోపలి వరకు కోసుకుపోవడంతో ఆమె పేగులు బయటపడ్డాయి. ఎలాగోలా అనితను స్థానికులు కాపాడి ఆసుపత్రికి తరలిం చారు. అయితే, ఘటనలో అనిత ప్రాణాలతో బయటపడినా బిడ్డ ప్రాణాలు కాపాడలేకపో యారు. వైద్యులు. అనిత కడుపులో మగబిడ్డ ఉన్నట్లు తేల్చారు. తన సోదరులతో ఆస్తి తగాదా కారణంగానే తన భార్యనే నాపై దాడి చేసి గాయపరిచి, తప్పు డు కేసు పెట్టేందుకు ప్రయత్నిస్తోందని పన్నాలాల్ కోర్టులో వాదించాడు. ఇరువైపులా వాదనలు విన్న కోర్టు పన్నాలాల్ రాక్షసత్వాన్ని నిర్ధారించుకొని అతడికి జీవిత ఖైదు విధించింది.






