31 July, 2026 | 11:17 PM

ఇవి సైబర్ నేరాల డెన్‌లు

25-05-2024 03:13 AM

న్యూఢిల్లీ, మే 24: జార్ఖండ్‌లోని జమ్తా రా, హరియాణాలోని మేవాత్ పట్టణాలు దేశంలో సైబర్ నేరాలకు హాట్‌స్పాట్‌గా మారాయి. ఈ విధంగా సంపాదించిన డబ్బులో 46శాతం సైబర్ నేరాలకు అడ్డాగా మారిన ఆగ్నేయాసియాలోని కంబోడియా, మయన్మార్, లావోస్‌కు చేరుతున్నాయి. భారత సైబర్ నేరాల సమన్వయ కేంద్రం (ఐ4సీ) సీఈవో రాజేశ్ కుమార్ ప్రకారం.. ఈ దేశాల్లో కార్పొరేట్ స్టుల్‌లో ఆర్గనైజ్డ్ సైబర్ క్రైం బృందాలు ఉన్నాయి. వాళ్లు భారతీయ ఉద్యోగార్థులను ఏజెంట్లుగా అక్రమం గా నియమించుకుంటున్నారని, వారి ద్వారా భారతీయ పౌరులను దోచుకుంటున్నారని కుమార్ తెలిపారు. ఐ4సీతోపాటు కొన్ని ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలు ఇలాంటి అక్రమ ఏజెంట్ల నియా మకాన్ని గుర్తించాయి. ఇప్పటికే ఈ ఉచ్చులో చిక్కుకున్న 360 మందిని తిరిగి భారత్‌కు తీసుకువచ్చేందుకు విదేశాంగ ఏర్పాట్లు చేసింది.

మరో 60 మందిని త్వరలో కంబోడియా నుంచి తీసుకువచ్చేందుకు ప్రయ త్నిస్తోంది. ఈ ఏడాదిలో ఆగ్నేయాసియా దేశాల నుంచి జరిగిన సైబర్ నేరాల్లో 62,587 పెట్టుబడి మోసాల్లో రూ.1,420 కోట్లు, 20,043 ట్రేడింగ్ స్కామ్‌ల్లో రూ.222 కోట్లు, 4,600 డిజిటల్ స్కామ్‌ల్లో రూ.120 కోట్లు, 1,725 డేటింగ్ మోసాల్లో రూ.13 కోట్లు కొల్లగొట్టారు. గత సంవత్సరం లక్షకుపైగా పెట్టుబడి మోసాలు నమోదైనట్లు కుమార్ తెలిపారు. ఈ స్కామ్‌లకు సంబంధించి చైనా ప్రమేయాన్ని తోసి పుచ్చలేమన్నారు కుమార్. ఈ సైబర్ క్రైం హబ్‌లలో పెద్ద సంఖ్యలో చైనీయులు పనిచేస్తున్నారని వెల్లడించారు. ప్రజలను మోసం చేయడానికి ఉపయోగించే అనేక అనుమానిత యాప్‌లు చైనీస్ భాషలోనే ఉన్నాయని చెప్పారు.