మేడ్చల్‌లో రోడ్లకు మరమ్మతులు చేయాలి
మేడ్చల్ అర్బన్, మే 14 (విజయ క్రాంతి): మేడ్చల్ పట్టణంలో రోడ్లు అధ్వానంగా తయారయ్యాయని మరమ్మతులు చేయాలని మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ చీర్ల రమేష్ సిఎంసి కమిషనర్ సృజనకు వినతి పత్రం అందజేశారు. మేడ్చల్ హౌసింగ్ బోర్డ్ కాలనీ నుండి లైబ్రరీ రోడ్ వరకు 300 మీటర్ల రహదారి పూర్తిగా దెబ్బతిన్నదని నిత్యం విద్యార్థులు ఉద్యోగులు ప్రమాదాలకు గురవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.వెంటనే రోడ్డు మరమ్మత్తును పూర్తి చేసి నూతన సీసీ రోడ్డు నిర్మించాలని సిహెచ్ రమేష్ కోరారు.
మేడ్చల్ మాజీ సర్పంచ్ చీదు దేవేందర్ రెడ్డి ఇంటి నుండి ముదిరాజ్ సంఘం వరకు ఉన్న 250 మీటర్ల రోడ్డును అభివృద్ధి చేసి సీసీ రోడ్ వేయాలని ఆయన సిఎంసి కమిషనర్ కు విజ్ఞప్తి చేశారు.మేడ్చల్ మున్సిపల్ పట్టణంలోని అన్ని కాలనీలలో శానిటేషన్ నిర్వహణ మెరుగుపరచాలని వీధి దీపాలు ఏర్పాటు చేసి రాత్రి వేళల్లో ప్రజలకు భద్రత కల్పించాలని మున్సిపల్ వైఫ్ చైర్మన్ సిహెచ్ రమేష్ సూచించారు.
గుంతలమయంగా మారిన రోడ్లకు తక్షణమే సీసీ ప్యాచ్ వర్క్ పనులు చేపట్టాలని ఆయన కోరారు.మేడ్చల్ మున్సిపల్ పట్టణంలో నెలకొన్న సమస్యలపై చీర్ల రమేష్ విన్నపంపై కమిషనర్ డాక్టర్ జి.సృజన తక్షణమే స్పందించి సంబంధిత అధికారులను పిలిపించి సమస్యల పరిష్కారానికి క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ కమిషనర్ స్పందన పట్ల రమేష్ హర్షం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతున్న చీర్ల రమేష్ కృషిని స్థానిక కాలనీల ప్రజలు అభినందిస్తున్నారు.






