22 June, 2026 | 8:00 PM

Breaking News

పెన్షనర్ ల సమస్యను పరిష్కరించండి   •   పెంచిన ఎరువులు, డీజిల్, పెట్రోల్ ధరలు తక్షణమే తగ్గించాలి   •   ప్రైమరీ టీచర్ల భర్తీలలో జిల్లా వ్యాప్తంగా ఒకే విధానం కొనసాగాలి   •   కోయగూడెం ఓసీపీలో సింగరేణి డైరెక్టర్ (ఈ&ఎం) తిరుమల రావు పర్యటన   •   అమెరికాలో గంగారం యువకుడు మృతి   •   విద్యార్థులకు నోట్ పుస్తకాలు అందజేసిన అదనపు కలెక్టర్ వేణుగోపాల్   •   భూముల సర్వేను పక్క చేయాలి   •   ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి: జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి   •   గిరిజన సంక్షేమ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి: టిపిటిఎఫ్   •   వీబీజీ రాంజీ చట్టంతో కూలీలకు ఉపాధి అవకాశాలు తగ్గిపోతాయి   •  

జీవాల దొంగలకు రిమాండ్

22-10-2024 12:16 AM

5 మేకలు, రూ.1.45 లక్షల నగదు స్వాధీనం

అబ్దుల్లాపూర్‌మెట్, అక్టోబర్ 21: మేకలు, గొర్రెల దొంగతానికి పాల్పడుతున్న ఇద్దరు దొంగలను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు. అబ్దుల్లాపూర్‌మెట్ ఎస్‌ఐ అంజిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 15న రాత్రి  మండలంలోని అనాజ్‌పూర్‌లో 5 మేకలను గుర్తుతెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. మేకల యాజమాని నాగరాజు మెట్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

విచారణ చేపట్టిన పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా వైహికల్ నెంబర్‌ను ట్రేస్ చేశారు. సోమవారం ఉదయం 5 గంటల సయమంలో కొత్తగూడెం చౌరస్తాలో ఉన్నట్లు గుర్తించారు. నల్గొండ జిల్లా హాలియాకు చెందిన సంపంగి వెంకటేశ్(26), ఇబ్రహీంపేట మండలానికి చెందిన సంపంగి కోటేశ్ (25)లను అదుపులోకి తీసుకున్నారు.

పోలీస్‌స్టేషన్ తరలించి విచా రించగా.. తామే నేరం చేసినట్లు అంగీకరించారు. గడిచిన మూడు నెలల నుంచి యాచారం, మంచాల్, మహేశ్వరం, చౌటుప్పల్, ఇబ్రహీంపట్నం, నారాయణ్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మేకలు, గొర్రెలను దొంగిలించినట్లు పేర్కొన్నారు. కాగా వీరి నుంచి 5 మేకలు, రూ.1.45 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.