2 May, 2026 | 6:49 PM

Breaking News

రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అన్నదాతల అవగాహన కార్యక్రమం   •   మేడ్చల్ జిల్లా మానవ హక్కుల సంఘం అధ్యక్షుడిగా కేకే చారి ఎన్నిక   •   ప్రజా అవసరాలను గుర్తించి పరిష్కరించేలా ప్రజా పాలన సభలు   •   గుండెపోటుతో మరణించిన హోంగార్డ్ సురేష్ భౌతిక కాయానికి నివాళులర్పించిన ఎస్పీ రోహిత్ రాజు   •   ఆర్డీవో ఆఫీసుల్లోనూ ప్రజావాణి..!   •   సిబ్బంది అంకితభావంతో విధులు నిర్వహించాలి   •   నీట్ పరీక్షపై ఇన్విజిలేటర్ల ఓరియెంటేషన్ కార్యక్రమం   •   వైభవంగా స్వామివారి నిత్య కళ్యాణం   •   మెరుగైన సేవల కోసం 108 సిబ్బందికి శిక్షణ   •   వేతనాల కోసం మున్సిపాలిటీ కార్మికుల నిరవధిక సమ్మె ప్రారంభం   •  

పురమంతా వెలుగులు.. అంబేద్కర్ సెంటర్‌లో చీకట్లు!?

09-03-2026 12:57 AM

కేసముద్రం, మార్చి 8 (విజయక్రాంతి): కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలో ఇటీవల ప్రతి విద్యుత్ స్తంభానికి కొత్తగా వీధిలైట్లు ఏర్పాటు చేయించారు. దీనితో పట్టణం రాత్రి పూట దేదీప్య ప్రమాణంగా వెలుగులు విరజిమ్ముతూ అత్యంత కాంతి వంతంగా మారిపోయింది. అయితే పట్టణంలోని ప్రధాన కూడలిగా ఉన్న అంబేద్కర్ సెంటర్ లో వీధిలైట్లు ఏర్పాటు చేయకపోవడం, గతంలో ఏర్పాటు చేసిన సోలార్ విద్యుత్ దీపాలు పాడై పోవడం వల్ల అంధకారంలో మగ్గిపోతుంది.

అంబేద్కర్ సెంటర్లో వీధిలైట్లు లేకపోవడం వల్ల సమీపంలోని రైల్వే స్టేషన్ నుండి రాత్రిపూట రైలు దిగిన ప్రయాణికులు చీకటి లో అంబేద్కర్ సెంటర్ వరకు రావడానికి సెల్ఫోన్లను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కేసముద్రం పట్టణంలో వీధిలైట్లు ఏర్పాటు చేసిన అధికారులు, అంబేద్కర్ సెంటర్ వద్ద వీధిలైట్లు ఏర్పాటు చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. అధికారులు స్పందించి వెంటనే అంబేద్కర్ సెంటర్లో వీధిలైట్లు ఏర్పాటు చేయాలని కోరుకున్నారు.