మహిళా శక్తి సమాజ ప్రగతికి మూలాధారం
ఎమ్మెల్యే నవీన్ యాదవ్
జూబ్లీహిల్స్, మార్చి 8(విజయక్రాంతి): అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భం గా ఎల్లారెడ్డి గూడలోని నాగార్జున సంక్షేమ సమితి ఆవరణలో వసుదైక ఫౌండేషన్, గురుస్తాన్ ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినో త్సవ వేడుకలు నిర్వహించారు. ఆదివారం జరిగిన ఈ వేడుకలకు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ముఖ్య ఆహ్వానితులుగా హాజరయ్యారు. మహిళా ధ్యానం ప్రగతికి మూలం అనే నినాదంతో నిర్వహించిన ఈ కార్యక్రమం లో మూగజీవాల సంరక్షణ, మెడిటేషన్, శాఖాహార జీవన విధానంపై అవగాహన కల్పిం చారు. అనంతరం మహిళలను ఎమ్మెల్యే శాలువాలతో సన్మానిం చి వారి సేవలను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆర్గనైజర్లు శ్రీనివాస్ గౌడ్, విశ్వ, లక్ష్మి, లోకేష్, సురేష్, పావని, రాంగోపాల్తో పాటు వసుదైక ఫౌండేషన్ పాల్గొన్నారు.
మహిళలతో దేశ ప్రగతి
ముషీరాబాద్: జనాభాలో సగభాగమైన మహిళలు మహిళలు సాధికారత సాధిం చినప్పుడే దేశ ప్రగతి పదంలో నడుస్తుందని ఐఎన్ టియుసి రాష్ట్ర ముఖ్య ఉపాధ్యక్షులు, జలమండలి ఎంప్లాయిస్ యూనియన్ అధ్య క్షులు మొగుళ్ళ రాజిరెడ్డి అన్నారు. హైద రాబాద్ లోని ఖైరతాబాద్ జలమండలి కేంద్ర కార్యాలయంలో ఆదివారం జలమండలి మహిళా మినిస్ట్రిరి యల్ స్టాఫ్ వెల్ఫేర్ అసో సియేషన్ ఆధ్వర్యంలో 116వ అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు జరిగా యి.
మహిళలకు సమాన అవకాశాలు..
మహిళలకు విద్య, నాయకత్వం, సమాన అవకాశాలు అందితే సమాజంలో వారు కీలక పాత్ర పోషిస్తారని ప్రముఖ శిశు హక్కుల కార్య కర్త, ఎంవీ ఫౌండేషన్ స్థాపక కార్యదర్శి డా. శాంతా సిన్హా స్పష్టం చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను మహిళా దక్షత సమితి అధ్యక్షురాలు డాక్టర్ సరోజ్ బజాజ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వ హించారు. గౌరవ అతిథులుగా ఈశ్వర్ లక్ష్మీ ఆసు పత్రి అధిపతి, సీనియర్ వైద్య నిపుణురాలు డా.సరోజ్ తపాడియా, రూబరూ సంస్థ సీఈ ఓ మోనిషా వేమవరపు, మోడల్ ఎన్ ఇండి యా సీనియర్ డైరెక్టర్ పద్మాక్షి నాగరాజ్ పాల్గొని వివిధ రంగాల్లో ప్రతిభ చూపిన మహిళా నాయకులను సత్కరించారు.
అహల్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో..
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అహల్య ఉమెన్స్ ఫౌండేషన్ అధ్యక్షు రాలు డాక్టర్ పూనమ్ నోముల్వర్ ఆధ్వర్యం లో నిర్వహించిన నారి శక్తి స్వరూప కార్యక్రమంలో భాగంగా సేవ, అభివృద్ధి పథంలో విజయాలు సాధించిన మహిళలను ఘనంగా శాలువాలు మెమోంటోలతో సత్కరించారు. కార్యక్రమంలో గాంధీనగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ ఎ. పావని వినయ్ కుమార్, డిసిపి సునీత, డాక్టర్ మీనాక్షీ పద్భనాభం, డాక్టర్ కాంచన్, అమిత రాణి, సారిక భర్గె, బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ. వినయ్ కుమార్, గీతికా, పాయల్ నోమల్వర్, విజేందర్, కిరణ్, సూర్య, ఎన్. రమేష్ పాల్గొన్నారు.
కఠినమైన చట్టాలు అవసరం
పంజాగుట్ట: సోమాజిగూడ ప్రెస్‌క్లబ్లో వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠ్ వైస్ చైర్మన్ డాక్టర్ ప్రీతిరెడ్డి హాజరయ్యారు. మహిళా జర్నలిస్టుల ధైర్యాన్ని అభినందించారు. హైదరాబా ద్ ప్రెస్ క్లబ్ సభ్యులందరికీ మల్లారెడ్డి, నారాయణ హృదయాలయ ఆసుపత్రుల్లో ఉచిత వైద్యం కోసం హెల్త్ కార్డులు అందజేస్తామని ప్రకటించారు.
ఖైరతాబాద్ జోన్ డీసీపీ శిల్పవల్లి మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో మహిళల పట్ల జరుగుతున్న డిజిటల్ దాడులను అరికట్టేందుకు కఠినమైన చట్టాల అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ ఎండి సోని బాలదేవి ఆడపిల్లలను క్రీడల్లో ప్రోత్సహించాలని పిలుపునివ్వగా, పాప్ సింగర్ స్మిత నేటి సమాజంలో పురుషులతో సమానంగా మహిళలు రాణిస్తున్నారని కొనియాడారు. ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఎస్.విజయకుమార్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి రమేష్ వరికుప్ప పాల్గొన్నారు.
పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేం
కుషాయిగూడ: సమాజ ఆరోగ్య రక్షణలో పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న సేవలు వెలకట్టలేనివని ఏ.ఎస్.రావు నగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ పజ్జూరి పావని మణిపాల్‌రెడ్డి కొనియాడారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం కమలనగర్లోని ఆమె నివాసంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డివిజన్కు చెందిన మహిళా పారిశుద్ధ్య కార్మికుల ను ఆమె ప్రత్యేకంగా ఆహ్వానించి, శాలువాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం వారికి మిఠాయిలు పంపిణీ చేసి శుభాకాంక్షలు తెలిపారు. మహిళలు ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలని, పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమానికి తమ వంతు సహకారం ఎప్పుడూ ఉంటుందని ఆమె స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, మహిళా ప్రతినిధులు మరియు కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
కాప్రా ప్రెస్ క్లబ్ కార్యాలయంలో..
ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం కాప్రా ప్రెస్ క్లబ్ కార్యాలయంలో తాజాగా బాధ్యతలు చేపట్టిన కాప్రా ప్రధాన పత్రికలు సీనియర్ జర్నలిస్టుల ప్రెస్‌క్లబ్ ప్రతినిధులు పారిశుద్ధ కార్మికులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వారి సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు జ్యోతిర్మయ చారి, ప్రధాన కార్యదర్శి ఆదిమూలం శ్రీనివాస్, కోశాధికారి వట్టిపల్లి సురేష్, ఉపాధ్యక్షులు పలుగుల పవన్, లక్కిడి బాల్రెడ్డి, కార్యదర్శిగా రోజా రాణి, కార్యనిర్వహణ కార్యదర్శి గడ్డమీద బాలరాజు గౌడ్ సీనియర్ జర్నలిస్టులు కేసి మోహన్, చంద్రమౌళి, క్యాసాని సత్యనారాయణ, కడియాల రమేష్, సహదేవా చారి, ఉల్లోజు శ్రీనివాస్, గుమ్మడి హరిప్రసాద్, రుద్రగోని నర్సింగ్ గౌడ్ పాల్గొన్నారు.
సమాజ శ్రేయస్సు కోసం..
జవహర్‌నగర్: సమాజ శ్రేయస్సు కోసం అహర్నిశలు శమిస్తున్న మహిళా పోలీసుల సేవలు వెలకట్ట లేనివని అడ్మిన్ ఎస్‌ఐ రాము నాయక్ అన్నారు. జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్ ఆవరణలో అడ్మిన్ ఎస్సై రామునాయక్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు జరిగాయి. రామునాయక్ మాట్లాడుతూ సమాజ శ్రేయస్సు కోసం వారి సేవలు వెల కట్టలేని వని తెలిపారు. అనంతరం మహిళ ఎస్సై మౌనిక సమక్షంలో కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు.
మహిళల చేతుల్లోనే భవిషత్తు..
మేడిపల్లి: తన ఓర్పు సహనంతో కుటుంబాన్ని పోషించే మహిళల చేతుల్లోనే సమాజ భవిష్యత్తు ఆధారపడి ఉందని మేడిపల్లి ఏసీపీ మోహన్ అన్నారు. మేడిపల్లి పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్న మహిళ కానిస్టేబుల్ లకు, మహిళా సిబ్బందికి సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో సీఐ గోవిందరెడ్డి, డిఐ ఎలక్షన్‌రెడ్డి పాల్గొన్నారు.
బోడుప్పల్ సర్కిల్‌లో..
మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ బోడుప్పల్ సర్కిల్‌లో అంబేద్కర్ ఆశయ సాధన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నత్తి మైసయ్య ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి 368వ ఆదివారం జ్ఞానమాల కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా బోడుప్పల్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ శైలజ, మాజీ ఎంపీటీసీ నత్తి జంగమ్మ తదితరులు పాల్గొని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ముఖ్య అతిధులను నత్తి మైసయ్య ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో భూ పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు బుగ్గ మైసయ్య, బోడుప్పల్ అరుంధతి మాదిగ సంక్షేమ సంఘం అధ్యక్షుడు గురుకుల యాకయ్య, చిల్ల అంజయ్య, కొండయ్య మేస్త్రి, జి వెంకటేశ్వర్లు, ఏ రాజేష్, యేసు రాజు, కంచి సతీష్, మహిళలు కమలమ్మ, విజయలక్ష్మి, సుగుణమ్మ, లింగమ్మ, యాకమ్మ, మంగమ్మ,సులోచన,లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
మహిళలతోనే సమాజ అభివృద్ధి
సికింద్రాబాద్: మహిళా సాధికారతే లక్ష్యంగా, ప్రతి మహిళ సామాజికంగా, ఆర్థికంగా ఉన్నత స్థాయికి ఎదగాలని మాజీ కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి అన్నారు. బాలానగర్ మాజీ కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు.
తార్నాక సేవా సమాఖ్య ఆధ్వర్యంలో..
అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఆదివారం తార్నాకలో ఘనంగా నిర్వ హించారు తార్నాక సేవా సమాఖ్య ఆధ్వ ర్యంలో మర్రి కృష్ణ హాల్లో, తార్నాక వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీహాల్‌లో జరిగిన మహిళాదినోత్సవ వేడుకల్లో మాజీ మేయర్, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బండ కార్తీక రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్తీక రెడ్డి మాట్లాడుతూ.. మహిళా సాధికారత కోసం కేంద్రంలోని నరేంద్ర మోడీ, బిజెపి ప్రభుత్వంచేస్తున్న కృషిని వివరించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ఉపయోగించుకొని, అన్ని రంగా ల్లో మహిళలందరూ రాణించాలని కార్తీక రెడ్డి తెలియజేశారు. మహిళలు బండ కార్తీక రెడ్డిని సన్మానించి, మెమెంటోను అందజేశారు.
సమాజాభివృద్ధిలో మహిళలే కీలకం
న్యూ బోయినపల్లీ బాపూజీనగర్ నేషనల్ యూనియన్ హాట్స్ బస్తీ, చిన్నతోకట్ట సంజీవయ్య నగర్ వీకర్ సెక్షన్ బస్తిల్లో వేడుకలు ఘనంగా జరిగాయి. కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్ ముఖ్య అతిధిగా హాజరై శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గోమతి,చంద్రకళ,లక్ష్మి,రాజమణి, పద్మ, వరద రాణి,సుజిత, లలిత భారతి,సాధన అనురాధ,ప్రతాప్,డి ఎం.అశోక్ కుమార్,వర ప్రసాద్,ముకేశ్ పాల్గొన్నారు




