లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ అపూర్వ అవార్డులు
ముషీరాబాద్, ఫిబ్రవరి 25 (విజయక్రాంతి): లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ అపూర్వ గత ఆరు నెలల్లో అందించిన విశేష సేవలకు లయన్స్ ఇంటర్నేషనల్ డిస్టిక్ట్ 320-ఎ రీజియన్ గుర్తించి 4 క్లబ్ సేవా అవారడ్స్ తో పాటు 3 వ్యక్తిగత అవార్డులకు ఎంపిక చేసి ప్రదానం చేసింది. ఈ మేరకు బుధవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ అపూర్వ అధ్యక్షుడు లయన్ డా.ఇ.ఎస్.సూర్యనారాయణ మాస్ట ర్ మాట్లాడుతూ అవార్డులను తనకు రీజియన్ ఛైర్ పర్సన్ లయన్ రఘుపతిరెడ్డి ప్రదానం చేశారని చెప్పారు.
అలాగే తనతోపాటు లయన్ సూర్యతేజ సుభ్రాంత్ మాస్టా ర్‌లకు కల్చరల్ బెస్ట్ కొరియోగ్రాఫర్ అవార్డును ముఖ్య అతిధిగా పి.డి.జి లయన్ ఎస్. నరేందర్‌రెడ్డి పాల్గొని అందజేసినట్లు చెప్పా రు. ఈ సందర్బంగా సూర్యనారాయణ మాస్టార్ ను క్లబ్ ప్రతినిధులు, ఉమాశంకర్ రెడ్డి, కోటేశ్వర్ రావు, పవన్ కుమార్ ఘనంగా సన్మానించారు.




