calender_icon.png 10 August, 2025 | 12:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇంట్లోనే మద్యం షాప్.. ఎక్సైజ్ దాడుల్లో గుట్టురట్టు!

07-08-2025 12:19:03 AM

ఇసుకలో మద్యం బాటిళ్లు దాచిన యువకుడు అరెస్ట్!

రాజన్న సిరిసిల్ల: ఆగస్టు 6 (విజయక్రాంతి); వేములవాడ అర్బన్ మండలంలోని రుద్రవరం గ్రామంలో అక్రమ మద్యం ముఠా కుప్పకూలిందివివరాల్లోకి వెళ్తే  వేములవాడ అర్బన్ మండలంలోని రుద్రవరం గ్రామంలో అక్రమ మద్యం విక్రయాలపై ఎక్సైజ్ శాఖ సి ఐ చంద్రశేఖర్ రెడ్డి , ఎస్‌ఐ రవి రెడ్డి ఆకస్మిక తనిఖీలు చేశారు. ఇంటి వద్దే మద్యం నిల్వ చేసి విక్రయిస్తున్న ముఠాను అధికారులు గుట్టు రట్టు చేశారు.

రుద్రవరం గ్రామానికి చెందిన సుంకి కార్తీక్ అనే వ్యక్తి తన నివాసంలోనే మద్యం అమ్ముతున్నట్లు సమాచారం అందడంతో, వేములవాడ ఎక్సైజ్ పోలీసులు ఆ కస్మిక దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఇంటి దగ్గర ఉన్న ఇసుకలో దాచిన 9 రెండు లీటర్ల ఖాళీ వాటర్ బాటిళ్లు మరియు 9 ఒక లీటర్ బాటిళ్లలో మద్యం నింపి దాచినట్లు గుర్తించా రు.అంతేగాకుండా... లేబుల్స్ ఉన్న, లేబుల్స్ లేని వివిధ రకాల మద్యం సీసాలు కూడా స్వాధీనం చేసుకున్నారు.తదుపరి విచారణలో, కార్తీక్కు మద్యం సరఫరా చేసిన వ్యక్తిగా తామరపల్లి సంతోష్ పేరు వెలుగులోకి వచ్చింది.

వెంటనే అతని ఇంటిపైనా పోలీసులు సోదాలు జరిపారు.సంతోష్ ఇంటి వద్ద కూడా విభిన్న బ్రాండ్లకు చెందిన దాదాపు 10 నుంచి 12 మద్యం బాటిళ్లు లభించా యి. వీరు ఈ మధ్యన్ని వేములవాడ మరియు పరిసర ప్రాంతాల్లోని వివిధ మద్యం షాపులో కొనుగోలు చేసి అధిక ధరలకు అమ్ముతున్నట్లుగా తెలిసిందిదోషులను అరెస్ట్ చేసిన ఎక్సైజ్ శాఖ, వారిపై కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.