10-08-2025 10:43:00 AM
మంథని యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షులు చీమల సందీప్..
మంథని (విజయక్రాంతి): మంథని నియోజకవర్గ(Manthani Constituency) యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆవిర్భవ దినోత్సవం పురస్కరించుకొని ప్రతి మండలంలో యూత్ కాంగ్రెస్ జెండా ఆవిష్కరణ చేయాలని రాష్ట్ర యూత్ కాంగ్రెస్ కార్యదర్శి బండ కిషోర్ రెడ్డి, మంథని యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షులు చీమల సందీప్ కోరారు. మంథని నియోజకవర్గ కేంద్రంలో జెండా ఎగరవేసి, ప్రతి ఒక్క యూత్ కాంగ్రెస్ నాయకులకు శుభాకాంక్షలు తెలియజేసి సందీప్ స్ఫూర్తిని అందజేశారు.