calender_icon.png 10 August, 2025 | 1:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేడు హైదరాబాద్‌లో 'వార్-2' సినిమా ప్రీ-రిలీజ్ వేడుక

10-08-2025 10:06:07 AM

హాజరుకానున్న జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్

యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr. NTR), బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్(Actor Hrithik Roshan) నటించిన 'వార్-2' సినిమా ప్రీ-రిలీజ్ వేడుకకు రంగం సిద్ధమైంది. ఈ కార్యక్రమం నేడు హైదరాబాద్‌లో అంగరంగ వైభవంగా జరగనుంది. యూసుఫ్‌గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి(KVBR) ఇండోర్ స్టేడియంలో ఈ కార్యక్రమం నిర్వహించానున్నారు. ఈ కార్యక్రమం సాయంత్రం 5 గంటలకు ప్రారంభించి రాత్రి 10 గంటల వరకు కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు.

ఇద్దరు అగ్ర తారలు ఒకే వేదికపై కనిపిస్తారు కాబట్టి.. ప్రీ-రిలీజ్ వేడుకకు పెద్ద సంఖ్యలో అభిమానులు, ప్రజలు హాజరవుతారని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో నగర పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. 'వార్-2' వేడుక కారణంగా, కెవిబిఆర్ స్టేడియం పరిసర ప్రాంతాల్లో తీవ్ర ట్రాఫిక్ అంతరాయం ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించారు. అందువల్ల, ఆదివారం సాయంత్రం ప్రయాణికులు యూసుఫ్‌గూడ మార్గం కాకుండా ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించాలని సూచించారు. అనవసరమైన అసౌకర్యాన్ని నివారించడానికి వాహనదారులు పోలీసులతో సహకరించాలని కోరారు.