07-08-2025 12:19:45 AM
రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు వినతి పత్రం అందజేసిన ఉద్యమకారులు
అబ్దుల్లాపూర్‌మెట్, ఆగస్టు 06: తెలంగాణ ఉద్యమకారులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం (టీయూఎఫ్) రాష్ట్ర ఉపాధ్యక్షులు జెనిగె విష్ణువర్దన్ అన్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా టీయూఎఫ్ ఆధ్వర్యంలో బుధవారం కలెక్టర్ సి. నారాయణరెడ్డిని కలిసి మెమోరాండం అందజేశారు. అనంతరం జెనిగె విష్ణువర్దన్ మాట్లాడుతూ..
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీ ప్రకారం 250గజాల ఇంటి స్థలాన్ని ఇవ్వలని కోరారు. అలాగే రూ. 25వేల పెన్షన్ ఇచ్చి.. సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ను కోరినట్లు తెలిపారు. ఉద్యమ సమయంలో ఎన్నో నిర్బంధలను ఎదుర్కొన్నామని గుర్తుచేశారు. సీమాంధ్ర పాలకులు మాపై ఎన్నో కేసులు బనాయించి.. జైల పాలు చేశారన్నారు.
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి 11 సంవత్సరాలు గడుస్తున్నా.. ఉద్యమకారులు తగు న్యాయం చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత ప్రభుత్వం ఉద్యమకారులను ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నరేందర్ గౌడ్, కొంతం యాదిరెడ్డి, బోసుపల్లి వీరేశం, నక్క జంగయ్య గౌడ్, దుగ్గాణి శ్యామల, జోర్క రాము ముదిరాజ్, అందే కర్ బాబూలాల్, చిత్రం కృష్ణ, భాను ప్రకాష్ రెడ్డి, కాటిపాక స్కైలాబ్, వరలక్ష్మి, నీరజ, రాధ, సురేష్, దుబ్బాక బచ్చు గళ్ళ రమేష్, రాజు నాయక్ పెద్ద ఎత్తున ఉద్యమకారులుపాల్గొన్నారు.