11 July, 2026 | 9:38 PM

Breaking News

ఆకట్టుకున్న ఐవీవై, సిద్ధార్థ రోబోటిక్స్ ఎక్స్ పో   •   సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల కళాశాల పేరెంట్స్ కమిటీ అధ్యక్షుని ఎన్నిక   •   సుల్తానాబాద్ శ్రీ శివాలయంకు లలిత అమ్మవారి విగ్రహం అందజేత   •   జిల్లా కమిటీలో ఎన్నికైన పటాన్‌చెరు జర్నలిస్టులకు ఘన సన్మానం   •   ఆవుపై చిరుత దాడి   •   'పేదల కన్నీళ్లు తుడవడమే ప్రభుత్వ లక్ష్యం'   •   కోనరావుపేటలో ఘనంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ జన్మదిన వేడుకలు   •   బేగంపేటలో దొంగల హల్‌చల్.. 20 పంపుసెట్ల విద్యుత్ కేబుళ్ల చోరీ   •   ఉద్యమానికి సిద్ధం.. 17న మందకృష్ణ మాదిగ రాక   •   బాధిత కుటుంబాలను పరామర్శించిన బీఆర్ఎస్ నేత చల్మెడ   •  

నేడు, రేపు నగరంలో మద్యం షాపులు బంద్

22-04-2025 01:47 AM

ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో నిర్ణయం

హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 21 (విజయక్రాంతి): హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ బుధవారం జరుగనుంది. ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం 4 గంటల నుంచి బుధవారం సా యంత్రం 6 గంటల వరకు నగరంలో ని మద్యం షాపులు బంద్ చేయాలని నగర పోలీసులు ఆదేశించారు.

నేడు, రేపు నగరంలోని వైన్స్, బార్‌అండ్‌రెస్టారెంట్లలోని మద్యం విక్రయాలు నిలిపివేయాలని ఆదేశించారు. ఈ నెల 25న జరుగబోయే కౌంటింగ్ రోజున  ఉదయం 6 గంటల నుంచి 26 ఉదయం 6 గంటల వరకు కూడా మద్యంషాపులను మూసివేయాలని పోలీసులు సూచించారు.