5 May, 2026 | 7:21 AM

టెస్ట్ క్రికెట్‌లో.. ఎక్కువ సిక్సర్లు కొట్టిన 'గండరగండడు' ఎవరు ?

02-09-2024 03:51 PM

ముంబాయి: టీ20ల్లో సిక్సర్లు ఎడాపెడా బాదే బ్యాట్స్ మెన్ల కు బాగా క్రేజ్ ఉంటుంది. కానీ టెస్టు మ్యాచులలో సైతం సిక్సర్ల మీద సిక్సర్లు కొట్టిన గండరగండడు లాంటి బ్యాటర్ల కు ప్రపంచ వ్యాప్తంగా అబిమానులుంటారు. వారిపై క్రికెట్ అభిమానుల హృదయాలలో అభిమానం ఎల్లలు లేని సముద్రంలా ఎగసి పడుతూ ఉంటుంది. అలాంటి వీరాధి వీరులైన క్రికెటర్ల జాబితాను  అభిమానుల కోసం క్రీడా పండితులు తెలిపారు . క్రిస్ గేల్, ఏబీ డివిలియర్స్, రోహిత్‌శర్మ వంటి పలువురు ప్లేయర్లు అంతర్జాతీయ క్రికెట్‌లో సిక్సర్లకు మారుపేరుగా ఉన్నారు. అయితే బ్యాటింగ్ నెమ్మదిగా సాగే టెస్ట్ క్రికెట్‌లో సిక్సర్లు బాదడం ప్రత్యేకమనే చెప్పాలి. ఈ ఫార్మాట్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాళ్ల జాబితాలో ఇంగ్లండ్ స్టార్ ఆటగాడు బెన్‌స్టోక్స్ అగ్రస్థానంలో ఉన్నాడు. టెస్ట్ ఫార్మాట్‌లో అతడు మొత్తం 131 సిక్సర్లు బాదాడు. అతడి తర్వాత స్థానాల్లో ఉన్నవారందరూ రిటైర్ అయిన క్రికెటర్లే కావడం గమనార్హం. కాగా టాప్5 జాబితాలో  ఒక్క క్రికెటర్ సైతం లేకపోవడం పరిశీలనార్హం  అంటున్నారు.

1. బెన్ స్ట్రోక్స్ --    131 సిక్సర్లు

2. బ్రెండన్ మెకల్లమ్ (న్యూజీలాండ్)--   107 సిక్సర్లు

3. ఆడమ్ గిల్క్రిస్ట్ ( ఆస్ట్రేలియా)--    100 సిక్సర్లు

4. క్రిస్ గేల్ (వెస్టిండీస్)--   98 సిక్సర్లు

5.జాక్వెస్ కలిస్ (దక్షిణాఫ్రికా)--  97 సిక్సర్లు