5 May, 2026 | 8:45 AM

తెలుగురాష్ట్రాల్లో వర్షాలు, వరదలపై స్పందించిన రాహుల్ గాంధీ

02-09-2024 03:34 PM

హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు, వరదలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎక్స్ వేదికగా స్పందించారు. వరదల్లో మృతి చెందిన కుటుంబాలకు రాహుల్ గాంధీ ప్రగాఢ సానుభూతి తెలిపారు. వరద సహాయక చర్యల్లో ప్రతి కాంగ్రెస్ కార్యకర్త పాల్గొనాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం శక్తివంచన లేకుండా కృషి చేస్తోందని ఆయన పేర్కొన్నారు. విపత్తులో నష్టపోయిన వారిని ప్రభుత్వాలు ఆదుకోవాలని రాహుల్ గాంధీ కోరారు.