22-12-2025 11:00:00 PM
తెలుగు రాష్ట్రాల్లో తొలిసారిగా స్పైన్‌రోబో
దీని సాయంతో శస్త్రచికిత్సల్లో అత్యంత కచ్చితత్వం
కిమ్స్ ఆస్పత్రుల సీఎండీ డాక్టర్ బొల్లినేని భాస్కరరావు
స్క్రూలను మిల్లీమీటర్ల కచ్చితత్వంతో అమర్చే వీలు
న్యూరోసర్జరీ విభాగాధిపతి మానస్ కుమార్ పాణిగ్రాహి
హైదరాబాద్, డిసెంబర్ 21(విజయక్రాంతి): ప్రపంచంలో, దేశంలో ఏ మూల నైనా వైద్యరంగంలో కొత్త ఆవిష్కరణలు వస్తే వాటిని వెంటనే అందిపుచ్చుకోవడం తమ ఆస్పత్రి లక్ష్యమని కిమ్స్ ఆస్పత్రుల సీఎండీ డాక్టర్ బొల్లినేని భాస్కరరావు అన్నారు. నగరంలోని నోవోటెల్ హోటల్‌లో ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో తెలుగు రాష్ట్రాల్లో తొలిసారిగా స్పైన్ రోబోను ఆవిష్కరించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. వెన్నెముకకు సంబంధించిన శస్త్రచికిత్సల్లో అత్యంత కచ్చితత్వం అవసరం అవుతుంటుందని, ఈ విషయంలో ఇప్పటివరకు తెలుగు రాష్ట్రాల్లో రోబోను ఎవరూ వాడలేదని, తొలిసారిగా తాము దీన్ని ఆవిష్కరించి, వెన్నెముక శస్త్రచికిత్సల్లో ఓ సరికొత్త శకానికి నాంది పలికా మని డాక్టర్ భాస్కరరావు చెప్పారు.
ముందుగా కార్యక్రమానికి వచ్చిన అతిథులను చీఫ్ రోబోటిక్ జాయింట్ రీప్లేస్‌మెంట్ సర్జన్ డాక్టర్ అన్నే సాయిలక్ష్మణ్ సాదరంగా ఆహ్వానించారు. అనంతరం సీనియర్ కన్సల్టెంట్ న్యూరోసర్జన్, కిమ్స్ ఆస్పత్రి న్యూరోసర్జరీ విభాగాధిపతి డాక్టర్ మానస్ కుమార్ పాణిగ్రాహి మాట్లాడుతూ.. అమెరికాకు చెందిన మెడ్రాట్రానిక్స్ కంపెనీ వారు తయారుచేసిన ఈ స్పైన్ రోబో కొండాపూర్ కిమ్స్ ఆస్పత్రిలో ఉండబోతోంది. ఆపరేషన్ చేసేటప్పు డే మనం సీటీ స్కాన్ తీసి, దాన్ని రోబోకు పంపుతాం. దానివల్ల పేషెంటుకు వేసే స్క్రూలు గానీ, ఎముక ఎంతమేర కత్తిరించాలన్న విషయాలను గానీ ముందుగానే దా నికి సూచిస్తాం. అప్పుడు అది 99.9% కచ్చితత్వంతో ఆ స్క్రూలను బిగిస్తుంది.
దానివల్ల స్క్రూలు పక్కన ఉండే నరాలకు తగలడం లాంటి సమస్యలు అస్సలు రావు. అలాగే ఆపరేషన్ చేసేటప్పుడు నరం డ్యామేజీ అవ్వ డం గానీ జరగదు. దానివల్ల రోగులు నూ టికి నూరుశాతం బాగా కోలుకుంటారు అని చెప్పారు. కిమ్స్ సన్‌షైన్ ఆస్పత్రి ఎండీ, చీఫ్ జాయింట్ రీప్లేస్‌మెంట్ సర్జన్ డాక్టర్ ఏవీ గురవారెడ్డి మాట్లాడుతూ, ఇంతకుముందు మోకాళ్ల మార్పిడికి, ఇతర ఆపరేషన్లకు రోబోలను వాడడం ద్వారా పూర్తి కచ్చితత్వాన్ని సాధించేవాళ్లమని, ఇప్పుడు వెన్నెముక శస్త్రచికిత్సల్లోనూ వీటిని తీసుకురావడం ద్వారా కిమ్స్ ఆస్పత్రి కొత్త చరిత్రను సృష్టించిందని అన్నారు. కొండాపూర్ కిమ్స్ ఆస్పత్రి కన్సల్టెంట్ మినిమల్లీ ఇన్వేజివ్ స్పైన్ సర్జన్ డాక్టర్ కే శ్రీకృష్ణ చైతన్య మాట్లాడుతూ, రోబోటిక్ సర్జరీ విధానం రావడం వల్ల ప్రధానంగా చిన్న పిల్లల్లో ఏవైనా వెన్నెముక సంబంధిత సమస్యలు వచ్చినా, గూని ఉన్నా కూడా చాలా సున్నితత్వంతో ఆపరేషన్ చేయడానికి వీలవుతుందన్నారు.
పిల్లలకు ఇలాంటి శస్త్రచికిత్సలు చేసేటప్పుడు నూటికి నూరుశాతం కచ్చితత్వం ఉంటుందని, రోబోతో అది తప్పక సాధ్యమవుతుందని తెలిపారు. కిమ్స్ ఆస్పత్రి కన్సల్టెంట్ న్యూరోసర్జన్, మినిమల్లీ ఇన్వేజివ్ స్పైన్ సర్జన్ డాక్టర్ బీవీ సవిత్ శాస్త్రి మాట్లాడుతూ, స్పైన్ సర్జరీకి సంబంధించి రోబోలను ఉపయోగించడం ఇప్పటివరకు మనదేశంలో నాలుగైదు చోట్ల మాత్రమే ఉందన్నారు. అందులోనూ తెలంగాణ, ఆం ధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఎక్కడా లేదన్నారు. తొలిసారిగా రోగుల కోసం కిమ్స్ కొండాపూర్ ఆస్పత్రిలో ఈ సర్జికల్ రోబోను ప్రవేశపెట్టడం ద్వారా రోగులకు అత్యున్నత స్థాయి వైద్యాన్ని అందించగలమని చెబుతున్నందుకు సంతోషిస్తున్నాం అన్నారు.
ఈ కార్యక్ర మంలో ఇంకా కోల్‌కతాలోని కొఠారీ మెడికల్ సెంటర్ స్పైన్ సర్జరీ విభాగాధిపతి, స్పైన్ ఫెలోషిప్స్ ప్రోగ్రాం డైరెక్టర్ డాక్టర్ సౌమ్యజిత్ బసు కూడా మాట్లాడుతూ.. ఇలాంటి అత్యాధునిక టెక్నాలజీని తెలుగు రాష్ట్రాలకు పరిచయం చేస్తున్నందుకు కిమ్స్ ఆస్పత్రి యాజమాన్యాన్ని అభినందించారు. ఈ కార్యక్రమానికి కొండాపూర్ కిమ్స్ ఆస్పత్రి రీజనల్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ సుధీర్ విన్నమాల వందన సమర్పణ చేశారు.