16 April, 2026 | 11:14 PM

Breaking News

సదాశివపేట పట్టణ ప్రజల తాగునీటి సమస్యలపై జగ్గారెడ్డి, నిర్మల సమీక్ష   •   గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •  

డ్రగ్స్ వినియోగం వల్ల జీవితాలు అస్తవ్యస్తం

23-06-2025 10:21 PM

మహబూబాబాద్ (విజయక్రాంతి): డ్రగ్స్ వినియోగం వల్ల జీవితాలతో పాటు కుటుంబాలు అస్తవ్యస్తంగా మారతాయని, డ్రగ్స్ కి ప్రతి ఒక్కరు దూరంగా ఉండాలని మహబూబాబాద్ రూరల్ ఎస్సై వి.దీపిక(Rural SI Deepika) అన్నారు. సోమవారం మహబూబాబాద్ మండలం జామండ్లపల్లి గిరిజన సంక్షేమ హాస్టల్ లో డ్రగ్స్ వల్ల కలిగే అనర్ధాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. డ్రగ్స్, ఇతర చట్ట విరుద్ధమైన కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, చదువుపైనే దృష్టి సారించాలని, చక్కగా చదువుకొని ఉజ్వల భవిష్యత్తుతో ఉత్తమ పౌరులుగా ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ రమేష్, హెడ్ కానిస్టేబుల్ రాజగోపాల్ రెడ్డి, కానిస్టేబుళ్లు సంపత్, అశోక్, హాస్టల్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.