18-07-2025 01:03:24 AM
పలు కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్
సదాశివనగర్,జూలై 17 (విజయ క్రాంతి): ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకునే లబ్ధిదారులకు మహిళా సంఘాల ద్వారా రుణాలు ఇప్పించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగు వాన్ తెలిపారు.ఆర్థిక పరిస్థితి బాగాలేని వారు రుణాలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన అన్నారు.గురువారం కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ మండలంలోని వజ్జేపల్లి, పద్మాజివాడి, సదాశివనగర్ గ్రామాల్లో కలెక్టర్ పర్యటించారు.
తీమ్మాజీవాడి గ్రామ శివారులో భూభారతి దరఖాస్తు ఫీల్ వెరిఫికేషన్ చేశారు. వజ్జపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల పురోగతిని పరిశీలించి లబ్ధిదారులతో చర్చించారు. శానిటేషన్ పనులను పరిశీలించి పలు సూచనలు చేశారు. అనం తరం పద్మాజీవాడి గ్రామంలో ఉన్నత పాఠశాలలో వన మహోత్సవంలో భాగంగా మొక్కలను నాటారు. విద్యార్థులతో ముచ్చటించి పాఠశాల నుండి త్రిబుల్ ఐటీ సాధించిన నలుగురు విద్యార్థులను సన్మానించారు.
మధ్యాహ్న భోజనం పరిశీలించి మెనూ ప్రకారం భోజనం అందించాలని నిర్వాహకులకు సూచించారు. కార్యక్రమంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి సురేందర్, రెవెన్యూ డివిజనల్ అధికారి వీణ, జిల్లా పంచాయతీ అధికారి మురళి, జిల్లా హౌసింగ్ డీఇ విజయ పాల్ రెడ్డి,జిల్లా విద్యాశాఖ అధికారి రాజు, అధికారులు పాల్గొన్నారు.