18-07-2025 01:03:35 AM
జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే
కుమ్రంభీం ఆసిఫాబాద్, జులై 17(విజయక్రాం తి): పిల్లలలో పోష క ఆహార లోపం నిష్పత్తిని తగ్గించా లని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. గురువారం కలెక్టరేట్‌లో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి, యూనిసెఫ్ ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహిం చారు.
పిల్లలలో పోషక ఆహార లోపం కలిగి న వారిని గుర్తించేందుకు క్షేత్రస్థాయిలో వైద్య ఆరోగ్యశాఖ, శిశు సంక్షేమ శాఖ అధికారులు సంయుక్తంగా యూనిసెఫ్ బృందం వారి సహకారంతో సర్వే నిర్వహించి పోషక ఆహార లోపం గల వారిని గుర్తించాలని, వారికి సకాలంలో పోషక ఆహారం, అవసర మైన మందులు అందించి పోషకాహారాలు లోపాన్ని అధిగమించేందుకు చర్యలు తీసు కోవాలని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి సీతారాం, యూనిసెఫ్ పోషకాహార నిపుణురాలు డా. ఖ్యాతి తివారి, న్యూట్రిషన్ ఆఫీసర్ రేష, బృంద సభ్యులు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.