17 April, 2026 | 3:15 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

బాట సింగారంలో రుణ ఔట్రిచ్ శిబిరం

14-02-2026 12:04 AM

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహణ

హైదరాబాద్, ఫిబ్రవరి 13(విజయక్రాం తి): సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో శుక్రవారం దేశ వ్యాప్తంగా వ్యవసాయ రుణ ఔట్రిచ్ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా హైదరాబాద్ రీజి యన్ బాట సింగారం బ్రాంచిలో  వ్యవసాయ రుణ ఔట్రిచ్ శిబిరాన్ని విజయవం తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం రీజనల్ హెడ్ గజేంద్రసింగ్ చౌహాన్ నాయక త్వంలో ప్రారంభమైంది.

రైతులకు సమయానుకూలంగా, సులభమైన నిబంధనలతో వ్యవసాయ రుణాలను అందిస్తూ వ్యవసాయ రంగాన్నిబలోపేతం చేయడంలో బ్యాంకు కట్టుబడిఉందని ఆయన పేర్కొన్నా రు. ఈసందర్భంగాఅబ్దుల్లాపూర్‌మెట్ పోలీ స్ ఇన్‌స్పెక్టర్ ప్రియాంకరెడ్డి సైబర్ నేరాలపైఅవగాహన కల్పించారు. డిజిటల్ మోసాల నుంచి ఎలా జాగ్రత్త పడాలి, సురక్షిత బ్యాం కింగ్ పద్ధతులు ఏమిటిఅనే అంశాలపై రైతు లు, వినియోగదారులకు అవగాహన కల్పించారు.

కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా జోజప్ప అదనపు డీఆర్‌డీఓ (జిల్లా గ్రామీణాభివృద్ధిఅధికారి),ప్రియాంకరెడ్డి, ఇన్‌స్పెక్టర్ సైబర్ క్రైమ్ పోలీస్ ఇన్స్‌పెక్టర్, అబ్దుల్లాపూర్‌మెట్, యడ్డయ్య డీపీఎం (బ్యాంకింగ్), ఎం.నర్సింహ అసిస్టెంట్ప్రాజెక్ట్మేనేజర్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా హైద రాబాద్ రీజియన్ పరిధిలో సుమారు రూ.20 కోట్ల విలువైన వ్యవసాయ రుణాల మంజూరు పత్రాలను రైతులకు అందజేశారు. అందులో బటాసింగారం బ్రాంచ్ ఒక్కటే సుమారు రూ.3 కోట్ల వ్యవసాయ రుణాలను మంజూరు చేసింది.ఈ కార్యక్రమంలో రైతులు, వినియోగదారులు, స్థానిక ప్రతినిధులు ఉత్సాహంగా పాల్గొన్నారు.