రెండు లక్షల 50 వేల ఎల్ఓసి అందజేత..
07-08-2025 06:54 PM
చిల్పూర్ (విజయక్రాంతి): జనగామ జిల్లా(Jangaon District) చిల్పూర్ మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన నామల రవి భార్య సరిత గత కొన్ని రోజుల క్రితం అనారోగ్య రిత్యా హాస్పిటల్ లో చికిత్స కొరకు ఎల్ఓసి మంజూరు చేయించాలని ఎమ్మెల్యే కడియం శ్రీహరి(MLA Kadiyam Srihari)నీ కోరగా వెంటనే స్పందించి ముఖ్యమంత్రి సహాయనిధి నుండి నామల సరితకి రెండు లక్షల 50 వేలు రూపాయల ఎల్ఓసి మంజూరు చేయించి, ఈరోజు లబ్దిదారునికి ఎల్ఓసీ అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పోలేపల్లి రంజిత్ రెడ్డి , నామాల మల్లేష్ , పశుల వెంకటేష్ నామాల రవి పాల్గొన్నారు.






