calender_icon.png 7 August, 2025 | 9:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సిర్గాపూర్ జడ్ పి.హెచ్.ఎస్ పాఠశాలలో రక్షాబంధన్

07-08-2025 06:58:27 PM

సిర్గాపూర్ (విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా(Sangareddy Districtసిర్గాపూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిష్యత్ ఉన్నత పాఠశాలలో గురువారం రక్షాబంధన్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. రక్షాబంధన్ యొక్క విశిష్టతను పిల్లలకు వివరించి, పాఠశాలలో బాలబాలికలు అందరూ సోదర, సౌభ్రాతృత్వంతో కలిసి మెలిసి చదువుకోవాలని, పాఠశాలకు, తల్లిదండ్రులకు, గురువులకు మంచి పేరు తేవాలని హితబోధ చేశారు. అనంతరం బాలికలతో అందరూ బాలురకు రక్షా ధారణ చేయించీ, మిఠాయిలు పంచిపెట్టారు. కార్యక్రమంలో ఎంఈవో నాగారం శ్రీనివాస్, లక్ష్మణ్, ఉపాధ్యాయ బృందం నిహారిక, నిర్మల, మహేందర్, మధుకర్ రెడ్డి, లక్ష్మీ, శ్రీరామ్, నాగభూషణం, రాంచందర్, సచిన్, గురునాథ్, సంతోష్ కుమార్ పీడీ, ఓంనాథ్, మారుతి, సీఆర్పి శివ కుమార్ పాల్గొన్నారు.