07-08-2025 06:51:06 PM
హర్షం వ్యక్తం చేస్తూ సీఎంకు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుకు కృతజ్ఞతలు తెలిపిన లబ్ధిదారుడు..
కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా(Kamareddy District) ఉమ్మడి మాచారెడ్డి పాల్వంచ మండలం ఎల్పుగొండ గ్రామంలో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం జరిగింది. దాదాపుగా 90 మంది లబ్దిదారులకు రేషన్ కార్డులు అందజేశారు. ఎల్పుగొండ గ్రామానికి చెందినని ఏక్బాల్ కు తను పుట్టి 40 సంవత్సరాలు పైబడిన ఇంతవరకు రేషన్ కార్డు పొందలేకపోయాను అని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డు లేని లబ్ధిదారులకు నూతనరేషన్ కార్డుల పంపిణీలో తనకు రేషన్ వచ్చినందుకు ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీకి, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. గురువారం కాంగ్రెస్ గ్రామ అధ్యక్షుడు అజహార్ మాట్లాడుతూ, లబ్ధిదారులకు రేషన్ కార్డుల పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ అని ఆరు గ్యారెంటీ లు అమలు చేస్తూ ప్రజలకుఎప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సయ్యద్ ఇంతియాజ్, దేవరాజ్, పరశురాములు, గిరిగంటి నరసింహులు, నవీన్, మరియు గ్రామ పంచాయతీ కార్యదర్శి ఇతర గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.