calender_icon.png 15 May, 2025 | 3:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాధిత కుటుంబానికి ఎల్‌వోసీ అందజేత

15-05-2025 01:30:32 AM

వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి

హనుమకొండ, మే 14 (విజయ క్రాంతి): వరంగల్ పశ్చిమ నియోజకవర్గానికి చెందిన మహమ్మద్ అన్వర్ హుస్సేన్ కుమార్తె మొహమ్మద్ నహీయా ఫిర్దోస్ కంటి సమస్యతో బాధపడుతున్న క్రమంలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ప్రత్యేక చొరతో బాధిత కుటుంబానికి రూ. 7,00,000/- లక్షల ఎల్ ఓ సి కాపీని అందజేశారు.

తదనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం నిరుపేదలకు వైద్యం, ఆరోగ్య విషయంలో అన్ని విధాలుగా అండగా ఉంటుందని, స్థానిక శాసన సభ్యుడిగా, నా దృష్టికి వచ్చిన అనారోగ్య సమస్యల పట్ల నా వంతు సహాయ సహకారం ఎల్లవేళలా అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఈ సందర్బంగా బాధిత కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసి, తమ కృతజ్ఞత భావాన్ని చాటుకున్నారు.