calender_icon.png 15 May, 2025 | 4:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అధైర్య పడకండి.. ప్రభుత్వం అండగా ఉంటుంది

15-05-2025 01:32:31 AM

తడిసిన ధాన్యాన్ని పరిశీలించిన మంత్రి సీతక్క

ములుగు, మే 14 (విజయక్రాంతి): అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని పూర్తిగా ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది.. అన్నదాతలు అధైర్యపడవద్దని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క హామీ ఇచ్చారు. ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం గోగుపల్లి గ్రామంలో మంగళవారం కురిసిన వర్షానికి తడిసిన ధాన్యాన్ని మంత్రి సీతక్క పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తడిసిన ధాన్యాన్ని పూర్తిగా ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని భరోసా ఇచ్చారు. జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు ధాన్యాన్ని యుద్ద ప్రాతిపదికన కొనుగోలు చేయాలని ఆదేశించారు.ఈ కార్యక్రమములో జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవి చందర్ తో పాటు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.