15-05-2025 01:28:52 AM
తొర్రూర్, మే 14: మహబూబాబాద్ జిల్లా తొర్రూరులోని ప్రసిద్ధ పాటి మీది ఆంజనేయస్వామి ఆలయంలో హనుమాన్ భక్తుల కోసం ప్రత్యేకంగా బుధవారం ఎస్‌ఆర్‌ఆర్ ఫౌండేషన్ అధినేత శ్రీనివాస్ రెడ్డి మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. హనుమాన్ దీక్ష తీసుకున్న వందలాది మంది భక్తులు సందర్భంగా శ్రీ ఆంజనేయస్వామి దర్శనానికి హాజరై, అనంతరం అన్నప్రసాదాన్ని స్వీకరించారు.
భక్తులందరికీ అన్నదాన సేవ అందించేందుకు ఎస్ ఆర్ ఆర్ ఫౌండేషన్ విస్తృతంగా ఏర్పాట్లు చేసింది.ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఆంజనేయస్వామి ఆశీస్సులతో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా, సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. భక్తులకు సేవ చేయడం మా ఫౌండేషన్ ధ్యేయం అని తెలిపారు.