13 May, 2026 | 1:31 AM

ముత్తారం వాసికి రూ. 2 లక్షల ఎల్‌ఓసీ అందజేత

13-05-2026 12:00 AM

మంత్రి శ్రీధర్ బాబు చొరవతో పేద కుటుంబానికి భరోసా

ముత్తారం,మే12 (విజయ క్రాంతి): అనారోగ్యంతో బాధపడుతున్న నిరుపేదలకు అండగా ఉండటమే ధ్యేయంగా రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తన ఉదారతను చాటుకున్నారు. ముత్తారం మండలంలోని ముత్తారం గ్రామానికి చెందిన తాడవేన శంకర్ గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

వైద్య ఖర్చుల నిమిత్తం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న శంకర్ కుటుంబ సభ్యులు తమ పరిస్థితిని మంత్రి శ్రీధర్ బాబు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై వెంటనే స్పందించిన మంత్రి, ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ ఎఫ్) ద్వారా రూ. 2,00,000 రెండు లక్షల రూపాయల ఎల్ ఓసీ మంజూరు చేయించారు.

అండగా నిలిచిన మంత్రి

మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు, హైదరాబాద్లోని ఆయన క్యాంపు కార్యాలయంలో మంత్రి సహాయకులు ఈ ఎల్‌ఓసీ పత్రాన్ని బాధితుడి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఆపత్కాలంలో తమకు అండగా నిలిచి, వైద్య సహాయం అందేలా చూసిన మంత్రి శ్రీధర్ బాబు కు బాధితుడి కుటుంబ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.