సోలార్ వాడకంతో విద్యుత్ ఖర్చు ఆదా
మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి
మానకొండూరు, మే 12 (విజయ క్రాంతి):సోలార్ విద్యుత్ వినియోగం ద్వారా ఆర్థికంగా ప్రయోజనం పొందాలని మానకొండూరు ఎమ్మెల్యే, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఎస్సీ సెల్ చైర్మన్ డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ కోరారు.మంగళవారం మానకొండూరు మం డలం పచ్చునూరు గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అందించనున్న సోలార్ సదుపాయాలపై తెలంగాణ రాష్ట్ర పునరుత్పాదక ఇంధన అభివృద్ధి సంస్థ (టీఎస్‌ఆర్‌ఈడీసీఓ) అధి కారులతో ప్రజలకు నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ పీఎం సూర్యఘర్ ముఫ్త్ బి జిలి యోజన పథకం ద్వారా గృహ వినియోగదారులు తమ ఇంటి డాబాలపై సోలార్ ప్లాంటు ఏర్పాటు చేసుకొని ప్రతి నెలా 360 యూనిట్ల వరకు పొందవచ్చున్నారు. ప్లాంట్ ఏర్పాటుకు ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుందని ఆయన తెలిపారు. మిగులు విద్యుత్ ను గ్రిడ్కు ఇచ్చి అదనపు ఆదాయాన్ని పొందవచ్చని ఆయన పేర్కొన్నారు.ఈ పథకాన్ని ప్రజలు వినియోగించుకోవాలని కోరారు.
వీవో భవన నిర్మాణానికి భూమి పూజ
మానకొండూర్ మండలం పచ్చునూరు గ్రామంలో వీవో భవన నిర్మాణ పనులకు మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ భూమి పూజ చేశారు.ఈ భవనం మహిళా సంఘాలకు అవసరమైన కార్యాచరణ మరింత సులభమై గ్రామాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుందని ఎమ్మెల్యే తెలిపారు.ఈ కార్యక్రమాల్లో టీఎస్ రెడ్ కో అధికారులు, సర్పంచ్ పార్నంది కి షన్, మండల తహసిల్దార్ వివి వరలక్ష్మి, మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నందగిరి రవీంద్ర చారి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మర్రి ఓదెలు యాదవ్, వైస్ చైర్మన్ తిరుమల్ రెడ్డి, పార్టీ నాయకులు రొంటాల లక్ష్మారెడ్డి, కనకం అశోక్, రేమిడి శ్రీనివాసరెడ్డి, పాల్గొన్నారు.






