4 May, 2026 | 3:34 PM

Breaking News

సీసీ రోడ్డు పనులకు భూమిపూజ చేసిన మేయర్   •   అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం స్థలం కేటాయించాలంటూ తాసిల్దార్ కు వినతి   •   తల్లి ఏడవకండి.. మా ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది   •   ప్రయాణికుల దాహార్తిని తీర్చేందుకే చలివేంద్రం   •   కేరళం హస్తగతం.. యూడీఎఫ్ ఆధిక్యం   •   మాది రైతు ప్రభుత్వం భరోసా లేని రైతు జీవితానికి భరోసా కల్పిస్తాం: విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్   •   ఇంకా ఓడిపోయినట్లు కాదు.. ఎన్నికల ఫలితాలపై మమతా బెనర్జీ స్పందన   •   ప్లాస్టిక్ గ్లాస్లో చాయ్ తాగితే 3,000 జరిమానా   •   కాంగ్రెస్ పార్టీ హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శిగా మారం రెడ్డి కౌటిల్ రెడ్డి   •   రైతు వేదికల్లో రైతులకు అవగాహన సదస్సులు   •  

చిహ్నంలో మార్పులు అవసరమా?

31-05-2024 12:05 AM

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై పదేళ్లు పూర్తయిన సందర్భంగా తెలంగాణ రాష్ట్ర గీతం, చిహ్నంలో మార్పులు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అందెశ్రీ రాసిన గీతాన్ని రాష్ట్రగీతంగా చేయాలనుకోవడంపై ఎవరికీ ఎలాంటి అభ్యంతరాలు లేకపోయినా, చిహ్నం మార్పుపై మాత్రం నిరసనలు వ్యక్తమ వుతున్నాయి. ఇంతకు ముందు బీఆర్‌ఎస్ ప్రభుత్వం రూపొందించిన చిహ్నంలోని కాకతీయ కళా తోరణం, చార్మినార్ చిత్రాలను తొలగించాలని రాష్ట్రప్రభుత్వం భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇది అనవసర వివాదానికి కారణమవుతోంది.  తెలంగా ణ చరిత్రకు రేవంత్ సర్కార్ తూట్లు  పొడుస్తోందని విపక్షాలు విమర్శిస్తున్నాయి. ప్రభుత్వం పునరాలోచించాలి.



-నరేశ్ గౌడ్,  నార్సింగి, రంగారెడ్డి జిల్లా.