4 May, 2026 | 2:06 PM

సిటీ బస్సులను పునరుద్ధరించండి

31-05-2024 12:05 AM

జూన్ నెల ప్రారంభంనుంచి రాష్ట్రంలో విద్యాసంస్థలు తిరిగి ప్రారంభం కానున్నాయి. వేలాది మంది విద్యార్థులు చదువుకోవడానికి దూరప్రాంతాలకు వెళ్లి వస్తుంటారు. సమయానికి బస్సులు దొరక్కపోతే వాళ్లంతా ఇబ్బంది పడతారు. ఎండలు మండిపోతున్నాయన్న సాకుతో నగరంలో మధ్యాహ్నం పూట చాలా సిటీ బస్సులను రద్దుచేసిన ఆర్టీసీ వాటిని తిరిగి పునరుద్ధరిస్తే అందరికీ సౌకర్యంగా ఉంటుంది. అధికారులు ఈ దిశగా ఆలోచన చేయాలి. 

 -టి.బి ప్రసాద్,  చిల్కానగర్, హైదరాబాద్