calender_icon.png 6 December, 2025 | 6:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలి..

06-12-2025 05:01:16 PM

ఇన్చార్జి జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.పుష్పలత

రాజన్న సిరిసిల్ల (విజయక్రాంతి): జిల్లాలోని ప్రజలందరూ ఈ నెల 21న జరిగే లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకొని, కోర్టులో పెండింగ్ లో ఉన్న కేసులను పరిష్కరించుకోవాలని ఇన్చార్జి జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికర సంస్థ అధ్యక్షురాలు బి.పుష్పలత అన్నారు. శనివారం జిల్లా కోర్టు సముదాయంలో జిల్లాకు చెందిన న్యాయమూర్తులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ పోలీసు అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించడం జరిగింది.

ఈ సందర్భంగా జిల్లా జడ్జి  పోలీసు అధికారులకు పలు సలహాలు, సూచనలు చేశారు. ఈ సమావేశంలో అదనపు జిల్లా ఎస్పీ డి.చంద్రయ్య, సీనియర్ సివిల్ జడ్జి, సిరిసిల్ల/ఇన్చార్జి కార్యదర్శి పి.లక్ష్మణాచారి, సీనియర్ సివిల్ జడ్జి, వేములవాడ అజయ్ కుమార్ జాదవ్, డీఎస్పీ నాగేంద్రచారి, మేజిస్ట్రేట్లు ప్రవీణ్, సృజన, జ్యోతిర్మయి పోలీసు అధికారులు పాల్గొన్నారు.