06-12-2025 05:03:29 PM
వ్యక్తిగత సమాచారం సామాజిక మాధ్యమాల ద్వారా ఇతరులతో పంచుకోవద్దు..
బోయినపల్లి (విజయక్రాంతి): తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో చేపట్టిన ఫ్రాడ్ కా ఫుల్ స్టాప్ అవగాహన కార్యక్రమం భాగంగా ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల పరిధిలోని రూసో కళశాలలో విద్యార్థులకు సైబర్ మోసాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్.ఐ జునైద్ మాట్లాడుతూ... సైబర్ నేరాల నుంచి రక్షించుకోవాలంటే అవగాహన తప్పని సరి అని డిజిటల్ జాగ్రత్తలు పెరగాలని సూచించారు. ప్రతి ఒక్కరూ సైబర్ భద్రతను వ్యక్తిగత బాధ్యతగా తీసుకోవాలని అనుమానాస్పద లింకులు, OTPలు, బ్యాంక్ వివరాలు పంచుకోవద్దు అని సూచించారు. ముఖ్యంగా సామాజిక మాధ్యమాల ద్వారా వ్యక్తిగత సమాచారం, ఫోటోలను ఇతరులతో పంచుకోకూడదు అని సూచించారు.
ప్రస్తుత కాలంలో వాట్స్అప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ను వాడేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సైబర్ మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో విద్యార్థులు ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి అని ఏదైనా మోసం జరిగిన వెంటనే 1930 కి కాల్ చేసి ఫిర్యాదు చేయాలి” అని సూచించారు.ఈ యెక్క కార్యక్రమంలో నేర్చుకున్న విషయాల్ని ప్రతి ఒక్కరు తమ ఇంట్లో వాళ్ళకు అవగాహన కల్పించాల్సి ఉంటుందని ఉపాధ్యాయులు కూడా సైబర్ నేరాల నియంత్రణలో తమవంతు పాత్ర పోషించాలని అన్నారు.