calender_icon.png 6 December, 2025 | 7:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సేవలు చిరస్మరణీయం

06-12-2025 04:59:00 PM

మేడ్చల్- మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు వజ్రెష్ యాదవ్..

మేడిపల్లి (విజయక్రాంతి): భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సేవలు చిరస్మరణీయమని మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్ అన్నారు. శనివారం రోజు  డాక్టర్ అంబేద్కర్ 69 వర్ధంతి సందర్భంగా బోడుప్పల్ అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన వర్ధంతి కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా వజ్రష్ యాదవ్ మాట్లాడుతూ బిఆర్ అంబేద్కర్ కలంతో భారత రాజ్యాంగాన్ని రచించి బడుగు, బలహీన వర్గాలకు, స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం, అందించిన మహనీయుడు, ప్రతి భారత పౌరుడుకి హక్కులు గౌరవం అవకాశాలు కల్పించి, సామాజిక సమానత్వం కోసం ఆయన జీవితాంతం పోరాడిన ధైర్య సాహసాలు సర్వదా స్ఫూర్తిదాయకం చిరస్మరణీయం అన్నారు. ఈ కార్యక్రమంలో బోడుప్పల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పోగుల నర్సింహారెడ్డి, మాజీ మేయర్ తోటకూర అజయ్ యాదవ్, మేడ్చల్ నియోజకవర్గం బి బ్లాక్ ప్రధాన కార్యదర్శి కొత్త కిషోర్ గౌడ్, బోడుప్పల్ అంబేద్కర్ సంఘం అధ్యక్షులు రాపోలు ఉపేందర్, మాజీ కార్పొరేటర్లు, స్థానిక నాయకులు, అంబేద్కర్ సంఘం సభ్యులు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.