calender_icon.png 29 July, 2025 | 10:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సనత్‌నగర్ కాంగ్రెస్‌లో లొల్లి!

29-07-2025 02:46:18 AM

  1. బల్కంపేట ఎల్లమ్మ ఆలయంతో రాజకీయం?
  2. ఆలయ బోర్డు నుంచి ఐల కుటుంబం ఔట్
  3. సంప్రదాయాలు పాటించని నేతలు!
  4. భక్తుల పట్ల దురుసు ప్రవర్తన
  5. పవిత్రతను కోల్పోతున్నదని భక్తుల ఆవేదన

సనత్‌నగర్, జూలై 24: సనత్‌నగర్ నియోజకవర్గ కాంగ్రెస్‌లో ముసలం మొదలైనట్టు తెలుస్తున్నది. పాత నాయకులను కొత్తగా పార్టీలో చేరిన వారు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బల్కంపేట ఎల్లమ్మ ఆలయ బోర్డులో కాంగ్రెస్ పార్టీ నేతలు సభ్యులుగా ఉండి ఆలయ పవిత్రతకు భంగం కలిగిస్తున్నారనే వార్తలు స్థానికంగా వినిపిస్తున్నాయి. రాష్ట్ర ఆధ్యాత్మిక చరిత్రలో విశిష్ఠ స్థానం కలిగిన హైదరాబాద్‌లోని బల్కంపేట ఎల్లమ్మ తల్లి ఆలయం ప్రస్తుతం వివాదాలకు కేంద్రంగా మారింది. 

ఎల్లమ్మ ఆలయం చుట్టూ రాజకీయం

1962లో స్థాపితమైన ఈ ఆలయం.. ఎల్లమ్మ తల్లి బావి చుట్టూ ఏర్పడిందని ప్రజల విశ్వాసం. ఈ ఆలయ భూములు చారిత్రకంగా ఐల కుటుంబానికి చెందినవి. వారే నాటి నుంచి ఆలయ వ్యవహారాలను నిర్వహించేవారు. 1998లో ఆలయం దేవాదాయ శాఖ పరిధిలోకి వచ్చినప్పటి నుంచి సంప్రదాయ పూజలన్నీ అధికారికంగా కొనసాగుతున్నాయి. గతంలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నేతృత్వంలో ఆలయంలో నిర్వహించే ప్రతి కార్యక్రమం సంప్రదాయబద్ధంగా జరిగేవి.

ఎల్లమ్మ తల్లి కళ్యాణాన్ని ఆలయం వెలుపల నిర్వహించడం ద్వారా భక్తులు, ప్రజాప్రతినిధులు సౌకర్యవంతంగా పాల్గొనగలిగారు. కమిటీ సభ్యులు అప్పట్లో పూర్తిగా మంత్రికి సహకరిస్తూ ఆలయ గౌరవాన్ని కాపాడారు. అయితే ఇప్పుడు పరిస్థితి మారిపోయిందని భక్తులు ఆరోపిస్తున్నారు. ఆలయ కమిటీలో సభ్యులుగా కొత్తగా నియమితులైన కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తులు అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ, సంప్రదాయాలను త్రోసిపుచ్చేలా ప్రవర్తిస్తున్నారని స్థానికుల వాదన.

ఐల కుటుంబ వారసులను బోర్డు నుంచి తప్పించటం, భక్తుల పట్ల దురుసు ప్రవర్తన, రౌడీయిజం వంటి చర్యలు ఆలయ పవిత్రతకు భంగం కలిగిస్తున్నాయని భక్తులు ఆరో పిస్తున్నారు. అంతేకాకుండా ఇటీవల ఒక కమిటీ సభ్యురాలిపై కేసు నమోదవడం, హైకోర్టులో సామాజిక కార్యకర్త పిటిషన్ వేయడం మరింత ఉద్రిక్తతకు దారి తీశాయి. బోర్డు చట్టబద్ధంగా లేదని, వారసుల హక్కులు కాలరాస్తున్నారని, భక్తుల నమ్మకాన్ని గాయపరుస్తు న్నారని ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు.

కొత్త వర్గం ఆధిపత్యం

సనత్‌నగర్ కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు పాత నేతలపై కొత్త వర్గం ఆధిపత్యం చెలాయిస్తున్నదని ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలోనే ఒకరిపై ఒకరు పోలీస్ కేసులు పెట్టుకుంటున్నారని తెలుస్తున్నది. ఆదేశాలను పట్టించుకోని ధోరణితో అంతర్గత కలహాలు ముదురుతున్నాయని సమాచారం. పార్టీలో తామే మాస్టార్లు అన్నట్టు ప్రవర్తిస్తున్న కొంతమంది కొత్త నేతలు, స్థానిక పార్టీ ఇన్‌చార్జి మాటల్ని కూడా విస్మరిస్తున్నారని సమాచారం.  

భక్తుల వేదన తీరేనా?

ఇలాంటి పరిస్థితుల్లో దేవాదాయ శాఖ తక్షణ జోక్యం అవసరమని భక్తులు భావిస్తున్నారు. బల్కంపేట ఎల్లమ్మ ఆలయ వారసు ల హక్కులను పునరుద్ధరించి, రాజకీయ జోక్యానికి చెక్ పెట్టే బాధ్యత అధికారులదే కాదు కాంగ్రెస్ పార్టీ కూడా అని భక్తులు చెపుతున్నారు. కాంగ్రెస్ అధిష్ఠానం ఆత్మపరిశీలన చేసుకోవల్సిన అవసరం ఉన్నదని వారు అంటున్నారు. భక్తుల గుండెల్లో భయంగా మారిన ఆలయ పాలన, రాజకీయాల ముసుగులో జరుగుతున్న అరాచ కాలు ఇవన్నీ ముగిసే దిశగా తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇది దేవాలయమా, లేక రాజకీయ రంగమా? అన్న ప్రశ్నకు సమాధానం ఇవ్వాలని ప్రజలు కోరుకుంటున్నారు.

రాజకీయ ముసుగులో రౌడీయిజం?

సనత్‌నగర్‌లో కాంగ్రెస్ నేతలు రాజకీయ ముసుగులో రౌడీయిజం చేస్తున్నారనే ఆరోపణలు స్థానికంగా బలంగా వినిపిస్తున్నాయి. ఇటీవలి కాలంలో కొత్తగా నిర్మిస్తున్న అపార్టుమెంట్లు, కొత్తగా వేస్తున్న బోర్లు, బిజినెస్ స్థలాలు లక్ష్యంగా పైసా వ సూల్ కార్యకలాపాలు నడుస్తున్నాయ ని బాధితులు చెపుతున్నారు. టౌన్ ప్లానింగ్ అధికారులతో ఆలయ కమి టీ సభ్యుల యాక్సెస్, అనధికారికంగా డబ్బులు వసూలు చేయడం, భయభ్రాంతులకు గురిచేయడం వంటి చర్య లు ప్రజాస్వామ్యాన్ని తాకట్టుపెట్టినట్టుగా ఉన్నాయని చెపుతునా రు. ఇది భక్తి కేంద్రాన్ని బెదిరింపు కేంద్రం గా మార్చినట్టు అవుతున్నదని స్థానిక ప్రజలు అభిప్రాయపడుతున్నారు.