calender_icon.png 29 July, 2025 | 10:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెచ్చులూడిన ఎంజీఎం నర్సింగ్ హాస్టల్ భవనం

29-07-2025 02:44:48 AM

  1. ఆదివారం రాత్రి ఘటన 

విద్యార్థులు లేకపోవడంతో తప్పిన ప్రమాదం

భవనం శిథిలావస్థకు చేరినా పట్టించుకోని వైనం

నిధులున్నా మరమ్మతులు చేయని అధికారులు 

వరంగల్, జూలై 28 (విజయక్రాంతి): తెలంగాణ జిల్లాల్లో పేరు ప్రఖ్యాతలు ఉన్న ఎంజీఎం ఆసుపత్రి నర్సింగ్ హాస్టల్ భవనం పెచ్చులూడింది. హాస్టల్‌లో ఉన్న ఓ గదిలోనే నర్సింగ్ విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తున్నారు. ఆ గదిలో ఆదివారం రాత్రి పెచ్చులూడి కిందపడ్డాయి. ఆ గదికి పైన ఉన్న మరో గదిలోనే విద్యార్థులు నిద్రిస్తుండగా ఈ ఘటన జరిగింది. రాత్రి వేళ కావడంతోపాటు, విద్యార్థులు ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది.

కాగా చాలా ఏళ్ల క్రితం నిర్మించిన హాస్టల్ భవనం శిథిలావస్థకు చేరినప్పటికీ సంబంధిత శాఖ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని సీనియర్ డాక్టర్లు, విద్యార్థులు, ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇతర జిల్లాల నుంచి నర్సింగ్ కోర్స్ విద్యను అభ్యర్థిస్తూ ఎంజీఎం ఆస్పత్రిలో వివిధ విభాగాల్లో విద్యార్థులు విధులు నిర్వహిస్తున్నారు. నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ పలుసార్లు ఆర్‌ఎంఓకు,

ఆసుపత్రి సూపరిండెంటెండ్‌లకు వినతిపత్రాలను సమర్పించినప్పటికీ నిర్లక్ష్యం వహిస్తున్నారని సమాచారం. అయితే మరమ్మతు ల కోసం విధులు మంజూరైనప్పటికీ అధికారులు అలసత్వం వహిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు స్పందించి, యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాలని, మరిన్ని నిధులు కేటాయించి కొత్త భవనం నిర్మించాలని విద్యార్థులు, ఉద్యోగ సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.