1 July, 2026 | 6:35 PM

Breaking News

రైతుల శ్రేయస్సుకు సహకార సంఘాలు కృషి చేయాలి   •   ధూప దీప నైవేద్య అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా శేషం శ్రీనివాసాచార్యులు   •   ప్రభుత్వ కళాశాలకు కంప్యూటర్ను అందించిన ఎన్నారై భాస్కర్ రెడ్డి   •   నెలరోజుల్లో అర్హులకు ఇండ్లు ఇవ్వకపోతే ఆక్రమిస్తాం   •   గజ్వేల్ ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీ   •   సింగరేణి ప్రధాన ఆసుపత్రిలో జాతీయ డాక్టర్ల దినోత్సవవేడుకలు-2026   •   ప్రభుత్వ పాఠశాలలకు డ్యుయల్ డెస్క్ బెంచీల పంపిణీ   •   సింగరేణి హెడ్ ఆఫీస్ నందు కేంద్ర కార్మిక సంఘాల నిర్వహించిన మహా ధర్నా విజయవంతం   •   జాతీయ డాక్టర్స్ డే సందర్భంగా పేదలకు ఉచిత వైద్య శిబిరం   •   గీతం 17వ గ్రాడ్యుయేషన్ డే ఆగస్టు 1న   •  

రెండు రైల్వే ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్

12-06-2025 12:00 AM
  1. రూ. 6,405 కోట్ల అంచనాతో పనులు
  2. నిర్ణయం తీసుకున్న ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ
  3. మంగుళూరు పోర్టును సికింద్రాబాద్‌తో అనుసంధానించేందుకు మార్గం సుగమం

న్యూఢిల్లీ, జూన్ 11: ప్రధానమంత్రి మోదీ నేతృత్వంలో బుధవారం భేటీ అయిన ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (సీసీఈఏ) కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోని రెండు రైల్వే ప్రాజెక్టుల డబ్లింగ్ పనులకు ఆమోదం తెలుపుతూ నిర్ణయం తీసుకుంది. క్యాబినెట్ నిర్ణయాలను కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాకు వివరించారు. 

6,405 కోట్లతో.. 

దేశవ్యాప్తంగా రూ. 6,405 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో రెండు ప్రాజెక్టుల డబ్లింగ్ పనులు చేపట్టనున్నారు. జార్ఖండ్‌లోని కోడెర్మా (133 కి.మీ), కర్ణాటకలోని బళ్లారి (185 కి.మీ) ఉన్నాయి. మొదటి ప్రాజెక్టు ఉన్న ప్రాంతంలో జార్ఖండ్‌లోని ప్రధాన బొగ్గు ఉత్పత్తి ప్రాంతాలు ఉన్నాయి. ఈ డబ్లింగ్ పనులు పూర్తయితే పాట్నా నడుమ అత్యంత సమర్థవంతమైన రైలు కనెక్టివిటీ అందనుంది.

ఇక కర్ణాటకలోని బళ్లారి రైల్వే లైన్ డబ్లింగ్ పనులు పూర్తయితే ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాకు కూడా ఉపయోగం ఉండనుంది. బళ్లారి రైల్వే లైన్ అనంతపురం గుండా వెళ్తుంది. ఈ నిర్ణయంతో మంగళూరు పోర్టును సికింద్రాబాద్‌తో అనుసంధానం చేసేందుకు మార్గం సుగమం అవనుంది. ఈ డబ్లింగ్ పనులకు రూ. 3,342 కోట్లు అవుతాయని అంచనా వేశారు. 

రవాణా ఖర్చులు తగ్గించింది.. 

మోదీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చాక రవాణా, లాజిస్టిక్ ఖర్చులను తగ్గించేందుకు అనేక ప్రాజెక్టులు చేపట్టింది. గతేడాది రవాణా ప్రాజెక్టుల కోసం సుమారు రూ. 4.5 లక్షల కోట్ల పెట్టుబడులు ఆమోదించబడ్డాయని మంత్రి వెల్లడించారు.