29 May, 2026 | 12:58 AM

చెరువు మట్టి దోపిడీ!?

29-05-2026 12:19 AM

సెలవు రోజు కూడా ఆగని నల్ల మట్టి దందా 

రెండు ఎక్సవేటర్లతో అక్రమంగా తరలింపు 

కన్నెత్తి చూడని అధికారులు 

బోయినపల్లి మే 28 (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం దుండ్రపల్లి చెరువు నుంచి అనుమతి పేరిట కొందరు వ్యక్తులు రెండు ఎక్సావేటర్లతో అడ్డదిడ్డంగా నల్ల మట్టిని తరలిస్తున్నారు. గురువారం సెలవు దినం అయినప్పటికీ అక్కడ పర్యవేక్షించాల్సిన ఇంజనీరింగ్ అధికారులు ఎవరూ లేకపోయినా అక్రమంగా టిప్పర్ల ద్వారా మట్టిని తరలిస్తున్నారు.

మట్టి తరలింపు అనుమతి ఇచ్చిన లేఖలో సెలవు రోజున మట్టి తరలించవద్దని ఇంజనీరింగ్ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. కానీ నిబంధనలకు విరుద్ధంగా అనుమతి పేరిట కొందరు వ్యక్తులు ఉత్తర్వులను బేకాతర్ చేస్తూ టిప్పర్ల ద్వారా మట్టిని తరలిస్తున్నారు. అదేవిధంగా ఉదయం 8 గం టల నుంచి సాయం త్రం 6 గంటల వరకు మాత్రమే నల్లమట్టి తరలించాలి కాని వారు ఉదయం అంతకన్నా ముందు నుంచే రాత్రి వరకు మట్టిని తరలిస్తున్నారు.

ప్రభుత్వని బంధనల ప్రకారం ఒక ఎక్సవెటర్ తో మట్టిని తరలించాలి. కానీ రెండు ఎక్సవెటర్ లు చెరువులో దించి మట్టిని ఇటుక పార్టీలకు ఇతర వ్యాపారాలకు మట్టిని అడ్డగోలుగా తరలిస్తున్నారు. ఈ విషయమై గ్రామస్తులు నీటిపారుదల శాఖ అధికారులకు ఫిర్యాదు చే సి ఫోన్ ద్వారా చెప్పిన వారు నిమ్మకు నీరు ఎత్తినట్టుగా వ్యవహరిస్తున్నారని వారు ఆగ్ర హం వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ ఈ విషయంలో కల్పించుకొని చిన్న నీటి వనరు లను కాపాడాలని గ్రామస్తులు కోరుతున్నారు. అదేవిధంగా అక్రమంగా నిబంధనలను విరుద్ధంగా మట్టిని తరలిస్తున్న వారిపై చర్య లు తీసుకోవాలని కోరుతున్నారు.