10-09-2025 12:00:00 AM
యుగ్యపురుషాపచయః క్షయః
హిరణ్యధాన్యాపచయో వ్యయః తాభ్యాం బహుగుణ విశిష్టే లాభే యాయాత్!
(కౌటిలీయం - 9-పనులు చేయగలిగిన యువత తగ్గిపోవడం క్షయం.. ధనం ధాన్యాదులు తగ్గిపో వడం వ్యయం. క్షయవ్యయాల కన్నా ఆదా యం అధికంగా ఉండడం లాభం. వీటిని పరిగణనలోకి తీసుకొని శత్రువుపై యుద్ధానికి వెళ్లాలని ఆచార్య చాణక్య చెపుతు న్నా రు. యుద్ధాలలో ఏ ఒక్కరూ విజయం సా ధించలేరు. గెలిచినా అది నిరర్ధక విజయంగా మిగిలే అవకాశాలే ఎక్కువ. ఆర్థిక, మానవ వనరులను రెండు వర్గాలూ నష్టపోతాయి. కలసి నడిస్తేనే ప్రగతి సాధ్యప డుతుంది. ఈనాడు సైనిక యుద్ధాల కన్నా వ్యాపార యుద్ధాలే దేశ భవిష్యత్తును నిర్ణయిస్తున్నాయి.
వ్యూహ ప్రతివ్యూహాలను ఆలోచించడం, అవసరానుగుణంగా వాటి ని మార్చుకోవడం, నిరంతర జాగరూకత వల్ల మాత్రమే. ఫలితం ఆస్వాదించడంతో నే.. దేశ ప్రజలకు ప్రగతిని అందించడం వీలౌతుంది. ఆధిపత్యానికై పోటీపడడం క న్నా ఒకరికొకరు సహకరించుకోవడం, స మన్వయం చేసుకోవడం.. రెండు వర్గాల ప్రయోజనాలను ఉన్నతీకరిస్తుంది. ప్రజ లూ స్వీయసమృద్ధిని సాధిస్తారు. దేశప్రగతిని అడ్డుకునే వారికి, వారి మార్గంలోనే బుద్ధి చెప్పాలి. నీళ్ళు ఉంటేనే చేపలు ఉం టాయి. దుర్మార్గం అనే నీటిని తీసివేస్తేనే అభివృద్ధి అనే చేపలను పట్టుకోగలం.
కొరవడిన నైపుణ్యం
భారతదేశంలో పనిచేయగలిగిన ఔత్సాహిక యువత అధికంగా ఉన్నా, వారిలో ఈనాటి పారిశ్రామిక అవసరాలకు తగిన నైపుణ్యాలు కొరవడిన కారణంగా యువశక్తి ఆశించిన మేరకు ఉపయోగపడడం లేదు. ప్రభుత్వాలు పూనుకొని యువతకు అవసరమైన నైపుణ్యాలను అందించడం ద్వారా ఆ అడ్డంకులను అధిగమిస్తే అద్భుతమైన సంపదను సృష్టించడం సాధ్యప డుతుంది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రష్యాపై అమెరికా విధించిన ఆంక్షల వల్ల, రష్యా చమురు వ్యాపారం సంక్షోభానికి గురైంది.
భారత్ తన అవసరాలకు రష్యా ఉత్పత్తిలో దాదాపు 40% చమురును కొనుగోలు చేస్తుంది. రష్యా నుంచి భారత్ చమురును కొనడం నిలిపివేస్తే చమురు లభ్యత తగ్గిపోయి ప్రపంచ వ్యాప్తంగా ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉన్నదని నిపుణులు చెపుతున్నారు. రష్యా వద్ద భారత్ చమురు కొనుగోలు చేయడం వల్ల ప్రపంచ మార్కెట్‌ను సమం చేయగలిగింది. ఆపత్సమయంలో అధిక మొత్తం లో చమురు కొనుగోలు చేస్తున్న భారతదేశానికి రష్యా తక్కువ ధరకు చమురును అమ్మడమే కాక.. భారత కరెన్సీలో చెల్లించడానికి ఒప్పుకున్నది. దానితో భారతదే శానికి అధిక మొత్తంలో విదేశీమారక ద్రవ్యం ఆదా అవుతున్నది.
అమెరికా శాంతి పాఠాలు!
వంద ఎలుకలను తిన్న పిల్లి తీర్థయాత్రకు వెళ్ళినట్లు.. అమెరికా యుద్ధాలను ప్రోత్సహిస్తూనే శాంతి పాఠాలు వల్లిస్తున్నది. పరస్పర అవగాహన, విశ్వాసాల నేపథ్యంలో భారత అమెరికాల మధ్య సం బంధాలు కొనసాగుతున్నాయి. భారతదేశ మేధ అమెరికా అభ్యున్నతికి సహకరిస్తున్నది. అయినా భారత్ రష్యా వద్ద చమురును కొని చెల్లిస్తున్న ధనంతోనే.. రష్యా, ఉక్రెయిన్ పై యుద్ధం కొనసాగిస్తున్నదని చెపుతూ భారతదేశ ప్రగతిని, స్థిరత్వాన్ని దెబ్బదీయడం లక్ష్యంగా, తన ఆధిపత్యాన్ని చాటుకునేందుకు, అమెరికా భారతదేశంపై.. 50 శాతం పన్నులను విధించింది.
దీని వల్ల ఇరుదేశాల ప్రజలూ నష్టపోతున్నారు. భారత్ టెక్స్‌టైల్స్, ఔషధాలు, ఆహారపదార్ధాలు, వజ్రాలు, సాఫ్ట్‌వేర్ లాంటి ఉత్పత్తులు అమెరికాకు ఎగుమతి చేస్తుంది. పన్నులు పెంచడం వల్ల అమెరికాలో భారత్ వస్తువుల ధరలు పెరిగి ఒకవైపు అమెరికా పౌరులపై భారం పడుతుంది. మరొకవైపు అమెరికాలో భారత్ అమ్మకాలు సన్నగిల్లుతాయి. భారత్ అమెరికాకు ఎగుమతి చేసే వస్తువులలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల ఉత్పత్తులే ఎక్కువ కావడం వల్ల, చిన్న పారిశ్రామిక వేత్తలు, వాటిలో పనిచేసే ఉద్యోగులు ఉపాధిని కోల్పోయే ప్రమాదము ఉన్నది. దానితో భారత స్థూల దేశీయోత్పత్తి కూడా ఒక శాతం వరకు తగ్గే అవకాశాలూ ఉన్నాయని నిపుణుల అంచనా.
ప్రత్యామ్నాయ మార్గాలు..
అమెరికాలో వ్యాపార అవకాశాలు పలుచనైన నేపథ్యంలో భారత్ ప్రత్యామ్నా య మార్గాలను వెతుక్కోవాలి. సూక్ష్మ, చి న్న, మధ్య తరహా పరిశ్రమల ప్రయోజనాలను కాపాడడం లక్ష్యంగా అన్వేషణలు జ రగాలి. తక్కువ జనాభా కలిగిన దేశాలలో ఎక్కువ వ్యాపార విస్తరణ అవకాశాలు ఉం డవు.
వ్యాపార విస్తరణ ప్రయత్నంలో ఇ ప్పటికే వ్యయిస్తున్న దానికి అదనంగా అధి క మొత్తంలో డబ్బును వ్యయించాల్సి ఉం టుంది. అది భారతదేశ ఆర్థిక వ్యవస్థపై భా రాన్ని పెంచుతుంది. దానికి ప్రత్యామ్నాయంగా స్వదేశీ వ్యాపార అవకాశాలను ప్రోత్సహించాలి. తగ్గించిన జీఎస్టీ లాం టివి దానికి ఉపకరిస్తాయి. అలాగే ఉత్పత్తు ల నాణ్యత పెంచుకునే సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు రాయితీలు ప్రకటిస్తే స్వదేశీ మార్కెట్ వృద్ధిచెందుతుంది.
మూడు అడ్డంకులు దాటితేనే
మనిషి జీవితం ఉన్నంత వరకూ సమస్యలు ఉంటూనే ఉంటాయి. అడ్డంకుల అంగడిలో అవకాశాలను వెతుక్కోగలిగితే నే అభ్యుదయ ఆకాశంలో విహరించగలుగుతాము. ఒక పనిని ఆరంభించిన సమ యంలో మూడు ముఖ్యమైన అడ్డంకులు ఎదురవుతాయి. మొదటిది.. నాయకునితో నే సమస్య రావచ్చు. ఔత్సాహికుడైన స భ్యుడు ధైర్యంతో వినూత్నమైన ప్రణాళికను నాయకుని ముందు పెడితే, క్రొత్తద నాన్ని ఆహ్వానించలేని నాయకుడు దానిని త్రోసివేయవచ్చు. పోటీదారులు ఆ ప్రణాళికకు అడ్డంకులు కల్పించవచ్చు.
ఒక్కొక్క మారు.. ప్రాంతీయ భావనలు, అపోహలు అడ్డంకులను సృష్టించవచ్చు. నిజానికి అ డ్డంకులే మన శక్తి సామర్ధ్యాలకు పరీక్షలు. వాటిని అధిగమించడానికి సహనం, ఓ ర్పు, భావ ప్రకటనా నైపుణ్యం లాంటివి అవసరం. నాణ్యత గలిగిన ఉత్పత్తులను సరసమైన ధరకు ఇవ్వగలగడం సాంకేతికత వల్ల సాధ్యపడుతుంది. యువతకు ఆ మార్గంలో శిక్షణనివ్వడం ద్వారా తాత్కాలికమైన అడ్డంకులను అధిగమించవచ్చు.
స మస్యలకు భయపడడం కాక సమస్యల వలయంలో కూడా ఫలితాలు సాధించగలిగిన వికాసాన్ని, ఆత్మస్థుర్యైన్ని యువత పొందేందుకు చేయూతనిచ్చి నడిపించ గలిగిన దార్శనికత గలిగిన నాయకత్వం అ మరిన వేళ అమెరికానే కాదు.. ఏ దేశమైనా ఎలాంటి అడ్డంకులు సృష్టించినా అభ్యుదయ మార్గంలో సాగిపోవడం.. సాధ్యపడుతుంది. క్షయమైనా.. వ్యయమైనా.. వ్యూహాత్మక ప్రణాళికల ద్వారా లాభాన్నే ఆర్జింజగలుగుతాము.