25 April, 2026 | 3:37 AM

కార్మికుల భద్రతే లక్ష్యం

25-04-2026 01:56 AM
  1. ఎన్‌జీఆర్‌ఐ సూచనల మేరకే సొరంగాల్లో తవ్వకాలు
  2. వేగవంతంగా ఎస్‌ఎల్‌బీసీ పనుల పునరుద్ధరణ
  3. కాళేశ్వరం బరాజ్‌ల పునరుద్ధరణలోనూ ఎన్‌జీఆర్‌ఐ భాగస్వామ్యం కావాలి
  4. ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయండి
  5. నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

హైదరాబాద్, ఏప్రిల్ 24 (విజయక్రాంతి): సొరంగ మార్గం తవ్వకాల్లో కార్మికుల భద్రతే ప్రభుత్వ లక్ష్యమని, వారి ప్రాణాలకే మొదటి ప్రాధాన్యం ఇస్తామని నీటి పారుదల శాఖ, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. అందుకు తగినట్లు గానే ఎన్‌జీఆర్‌ఐ శాస్త్రవేత్తల మార్గదర్శనానికి అనుగుణంగానే సొరంగ మార్గం తవ్వకాలు ఉంటా యని ఆయన పేర్కొన్నారు.

అలాగే రబీ సీజన్‌లో ధాన్యం కొనుగోలును వేగవంతం చే యాలని అధికారులను ఆదేశించారు. శ్రీశైలం ఎడమ గట్టుకాలువ సొరంగ మార్గం తవ్వకాలలో అనుకరించాల్సిన భద్రతా ఏర్పాట్లపై నేషనల్ జియో ఫిజికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ సమగ్రంగా రూపొందించిన నివేదికను శుక్రవారం సచివాలయంలో మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డికి ఎన్‌జీఆర్‌ఐ ప్రధాన శాస్త్రవేత్త సత్యనారాయణ అందించారు.

ఈ సందర్భంగా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఎన్‌జీఆర్‌ఐ సంస్థను అభినందించి, ఎస్‌ఎల్‌బీసీ పునరుద్ధరణ పనుల పురోగతితో పాటు కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్‌ల పునరుద్ధరణకు సంబంధించిన భూపరిశోధన (సాయిల్ టెస్ట్) భాగస్వాములు కావాలన్నా రు. ఎస్‌ఎల్‌బీసీ సొరంగ మార్గం తవ్వకాల సమయంలో జరిగిన దురదృష్టకర ఘటన పునరావృతం కాకుండా ఉండేందుకే తవ్వకాల సమయంలో అనుసరించాల్సిన భద్రతా ప్ర మాణాలపై ఎన్‌జీఆర్‌ఐతో సమగ్రంగా సర్వే నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.

తవ్వకాల సమయంలో ముందస్తుగా ప్రమాద అవకాశాలను గుర్తించేందుకు ఈ సంస్థ సీస్మిక్ ఇమేజిం గ్, ఎలక్ట్రికల్ రెసిస్టివిటి టొమోగ్రఫీ వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించినట్లు వివరించారు. ఎన్‌జీఆర్‌ఐ నివేదికలో స్ట్రె స్ జోన్‌లు, నీటి ఊరటలతో పాటు సొరంగమార్గం పైభాగం తదితర అంశాలపై శాస్త్రవే త్తలు సమగ్రంగా అధ్యయనం జరిపారని చె ప్పారు. ఎస్‌ఎల్‌బీసీ పునరుద్ధరణ పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయని వెల్లడించా రు.

ఎలక్ట్రిక్ లోడర్లు, భారీ డంపర్ల తోడ్పాటుతో ఇప్పటి వరకు 151.50 మీటర్ల తవ్వకం పూర్తి అయిందన్నారు. దేశీయ, అంతర్జాతీయ సంస్థల నుంచి ఆధునిక పరిజ్ఞానంతో కూడిన యంత్రాంగాన్ని సమీకరించి, రెండు వైపులా నెలకు 200 మీటర్ల వరకు తవ్వకాలు చేయాలన్నది ప్రభుత్వ సంకల్పమని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఈఎన్సీ రమేష్‌బాబు, సొ రంగ మార్గం తవ్వకాల నిపుణుడు పరిక్షిత్ మెహ్రా తదితరులు పాల్గొన్నారు.

రబీ సీజన్‌లో ధాన్యం కొనుగోలును వేగవంతం చేయాలని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇప్పటికే 20 జిల్లాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలకు ధా న్యం చేరుతుండడంతో కొనుగోళ్లు ప్రారంభం అయ్యాయని, సాగు ఆలస్యం అయినందున మరో 13 జిల్లాల్లో కొనుగోలు ప్రక్రియ ఇంకా మొదలు పెట్టలేదని పేర్కొన్నారు. రబీ సీజన్‌లో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియపై శుక్రవారం సచివాలయంలో పౌర సరఫరాల శాఖాధికారులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి ఉత్త మ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్ర భుత్వం అధికారంలోకి వచ్చాక ధాన్యం ఉత్పత్తి రికార్డు స్థాయిలో పెరిగిందన్నారు. అదేస్థాయి లో ముందెన్నడూ లేని రీతిలో ఈ రబీ సీజన్‌లో 90 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం సన్నద్ధంగా ఉందన్నారు. ధాన్యం కొనుగోలుకు రాష్ట్ర వ్యాప్తంగా 8,500 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రభు త్వం నిర్ణయించిందని, ఇప్పటికే 5,000  కేం ద్రాలను ప్రారంభించినట్లు వెల్లడించారు.

క్షేత్రస్థాయి నుండి వస్తున్న సమాచారం ప్రకారం రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున కొనుగోలు కేంద్రాలకు ధాన్యం రానుందని, అధికారులు తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఇప్పటి వరకు 4.89 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్టు తెలిపారు.   సమావేశంలో పౌరసరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, అడిషనల్ డైరెక్టర్ రోహిత్ సింగ్, డిప్యూటీ కమిషనర్ కొండల్‌రావు, జనరల్ మేనేజర్ ధాన్యం కొనుగోళ్లు, ఫైనాన్స్, మార్కెటింగ్, అధికారులు పాల్గొన్నారు.