9 August, 2026 | 2:32 AM

సమన్వయంతోనే ‘వికసిత్ భారత్’ సాకారం

09-08-2026 01:26 AM
  1. ఎంపీ డీకే అరుణ
  2. కన్హా శాంతి వనంలో విజన్ ఇండియా 

షాద్‌నగర్, ఆగస్టు 8 (విజయక్రాంతి): అకాడెమి, పరిశ్రమలు, ప్రభుత్వం సమన్వయంతో పనిచేసినప్పుడే వికసిత్ భారత్ లక్ష్యం సాకారమవుతుందని మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. 2047 కేవలం ఒక సంవత్స రం కాదని, దేశ భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. పాలమూరు యూనివర్సిటీ, కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో కన్హా శాంతి వనంలో శనివారం నిర్వహించిన విజన్ ఇండియా ఇంటి గ్రేటింగ్ సైన్స్, ఇన్నోవేషన్ అండ్ యూత్ ఎంపవర్మెంట్ రెండు రోజుల జాతీయ సద స్సు ముగింపు కార్యక్రమానికి డీకే అరుణ హా జరై ప్రసంగించారు. పాలమూరు యూనివర్సిటీ ప్రొఫెసర్ బి. లక్ష్మీకాంత్ రాథోడ్ ఈ సం దర్భంగా డీకే అరుణను సన్మానించారు.

రెం డు రోజులపాటు జరిగిన చర్చలు కేవలం ప్ర సంగాలకే పరిమితం కాకుండా సరికొత్త పరిశోధనలు, ఆవిష్కరణలు, స్టార్టప్లు, ఉపాధి అవకాశాలకు దారితీయాలని సూచించారు. విశ్వవిద్యాలయాలు కేవలం తరగతి గదులు, పరీక్షలు, పట్టాలకే పరిమితం కాకుండా జ్ఞానం, పరిశోధన, ఆవిష్కరణలు, సామాజిక మార్పు నకు కేంద్రాలుగా ఎదగాలని ఆమె అన్నారు. ము ఖ్యంగా పాలమూరు ప్రాంత అవసరాలకు అనుగుణంగా వ్యవసాయం, గ్రామీణా భివృద్ధి, ఆరోగ్యం, సాంకేతికత, ఉపాధి రంగా ల్లో పరిశోధనలు జరగాలని సూచించారు. యువతను కేవలం ఉద్యోగాలకోసం కాకుండా స మాజంలోని సమస్యలకు పరిష్కారాలు చూ పించే ఆవిష్కర్తలుగా, పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో విశ్వవిద్యాలయ స్వరం ఛాన్సలర్ శ్రీనివాస్, రిజిస్ట్రార్ రమేష్, అధ్యాపకులు, పరిశోధకులు, ప్రతినిధులు పాల్గొన్నారు.