calender_icon.png 4 December, 2025 | 3:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జోరుగా.. హుషారుగా

04-12-2025 12:00:00 AM

చివరిరోజు భారీగా నామినేషన్లు

కరీంనగర్, డిసెంబరు 3 (విజయ క్రాంతి): ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రెండవ విడత నామినేషన్ల ప్రక్రియ మంగళవారం ముగిసింది. నామినేషన్ల చివరోజు అభ్యర్థులు భారీగా నామినేషన్లను దాఖలు చేశా రు. సాయంత్రం 5 గంటలలోపు నామినేషన్ కేంద్రాలకు వచ్చిన అభ్యర్థుల నుంచి నామినేషన్లను స్వీకరించారు. నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ రాత్రి 11 గంటల వరకు కొ నసాగింది.

రెండవ విడత నామినేషన్ల ప్రక్రియ నవంబరు 30, ఈ నెల 1, 2 తేదీల్లో కొనసాగగా, ఈ నెల 2న చివరి రోజు భారీ గా నామినేషన్లు దాఖలయ్యాయి. మొదటి విడతలో నామినేషన్లు తక్కువ దాఖలు కాగా, రెండవ విడతలో ఎన్నికలు జరగనున్న గ్రామాల్లో భారీగా నామినేషన్లు దాఖలు చేశారు.

రెండవ విడతలో కరీంనగర్ జిల్లాలో 113 సర్పంచ్ స్థానాలకు 888 నా మినేషన్లు, 1046 వార్డు స్థానాలకు 3056 నామినేషన్లు దాఖలయ్యాయి. పెద్దపల్లి జిల్లాలో 73 సర్పంచ్ స్థానాలకు 576 నామినేషన్లు, 684 వార్డు స్థానాలకు 1854 నా మినేషన్లు దాఖలు చేశారు. జగిత్యాల జిల్లాలో 144 సర్పంచ్ స్థానాలకు 941 నామినేషన్లు, 1276 వార్డు స్థానాలకు 2927 నామినేషన్లు దాఖలయ్యాయి. 

మండలాల వారీగా...

కరీంనగర్ జిల్లాలోని చిగురుమామిడి మండలంలో 17 సర్పంచ్ స్థానాలకు 147 నామినేషన్లు, 174 వార్డు స్థానాలకు 561 నామినేషన్లు, గన్నేరువరం 17 సర్పంచ్ స్థానాలకు 133 నామినేషన్లు, 140 వార్డు స్థానాలకు 335 నామినేషన్లు, మానకొండూర్ 29 సర్పంచ్ స్థానాలకు 202 నామినేషన్లు, 280 వార్డు స్థానాలకు 822 నామినేషన్లు, శంకరపట్నం 27 సర్పంచ్ స్థానాలకు 226 నామినేషన్లు, 240 వార్డు స్థానాలకు 648 నామినేషన్లు, తిమ్మాపూర్ మండలంలో 23 సర్పంచ్ స్థానాలకు 180 నామినేషన్లు, 212 వార్డు స్థానాలకు 690 నామినేషన్లు దాఖలయ్యాయి.

అలాగే పెద్దపల్లి జిల్లాలోని అంతర్గాం మండలంలో 15 సర్పంచ్ స్థానాలకు 111 నామినేషన్లు, 132 వార్డు స్థానాలకు 309 నామినేషన్లు, ధర్మారం 29 సర్పంచ్ స్థానాలకు 228 నామినేషన్లు, 266 వార్డు స్థానాలకు 726 నామినేషన్లు, జూలపల్లి 13 సర్పంచ్ స్థానాలకు 100 నామినేషన్లు, 130. వార్డు స్థానాలకు 369 నామినేషన్లు, పాలకుర్తి 16 సర్పంచ్ స్థానాలకు 140 నామినేషన్లు, 156 వార్డు స్థానాలకు 450 నామినేషన్లు దాఖలయ్యాయి.

జగిత్యాల జిల్లాని బీర్పూర్ మండలంలో సర్పంచ్ స్థానాలకు 85 నామినేషన్లు, వార్డు స్థానాలకు 275 నామినేషన్లు, జగిత్యాల సర్పంచ్ స్థానాలకు 37, వార్డు స్థానాలకు 117, జగిత్యాల రూరల్ సర్పంచ్ స్థానాలకు 179, వార్డు స్థానాలకు 550, కొడిమ్యాల సర్పంచ్ స్థానాలకు 165, వార్డు స్థానాలకు 509, మల్యాల సర్పంచ్ స్థానాలకు 151, వార్డు స్థానాలకు 526, రాయికల్ సర్పంచ్ స్థానాలకు 205, వార్డు స్థానాలకు 598, సారంగాపూర్ సర్పంచ్ స్థానాలకు 119, వార్డు స్థానాలకు 352 నామినేషన్లుదాఖలయ్యాయి.