04-12-2025 12:00:00 AM
కరీంనగర్, డిసెంబర్03(విజయక్రాంతి): దివ్యాంగులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని.. వారు చదువుతోపాటు అన్ని రంగాల్లో రాణించేలా సహాయ సహకారాలు అందిస్తామని ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, దివ్యాంగులు, వయోవృద్ధుల శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పేర్కొన్నారు. బుధవారం శాతవాహన యూనివర్సిటీ సమీపంలో ఉన్న ప్రభుత్వ బధిరుల ఆశ్రమ పాఠశాలలో మహిళలు, పిల్లలు, వికలాంగులు,వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలోఅంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం నిర్వహించారు.
మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డితోపాటు మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ అనితా రామచంద్రన్, వయోవృద్ధుల దివ్యాంగుల సంక్షేమ శాఖ డైరెక్టర్ శైలజతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్నిప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. దివ్యాంగుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.50 కోట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు.
దివ్యాంగులైన ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. బధిరుల ఆశ్రమ పాఠశాలల్లో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంటర్ తరగతులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. రాష్ట్రంలోని బదిరుల ఆశ్రమ పాఠశాలల్లో అన్ని సౌకర్యాలు కల్పిస్తామని.. నిపుణులైన అధ్యాప కులను నియమించి సైన్ లాంగ్వేజ్ ద్వారా తరగతులు బోధిస్తామని వివరించారు.ది వ్యాంగులు తమలోని దివ్య దృష్టిని వృధా చేయవద్దని.. ఆసక్తి ఉన్న రంగాల్లో రాణించాలని సూచించారు.
అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇళ్ళ మంజూరులో ఐదు శాతం దివ్యాంగులకు కేటాయించేలా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేస్తామన్నారు. ఆర్టీసీ బస్సు పాసుల సమస్య కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామన్నారు.దివ్యాంగులు ఉంటున్న పాఠశాలల్లో ఏవైనా సమస్యలు ఉంటే తమను సంప్రదించాలని ప్రిన్సిపల్ సెక్రెటరీ కి సూచించారు. వచ్చే ఏడాది (దివ్యాంగుల దినోత్సవం) కల్లా దివ్యాంగుల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా దివ్య దృష్టి యూట్యూబ్ ఛానల్ ను ఆవిష్కరించారు.కలెక్టర్ పమేలా సత్పతి ఆధ్వర్యంలో దివ్యాంగులు పాడిన పాటను సీఎం ఆవిష్కరించినట్లు అతిథులు వివరించారు. దివ్యాం గుల శిశు సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ అనిత రామచంద్రన్ మాట్లాడుతూమన చుట్టూ ఉన్న దివ్యాంగులలో అద్భుత ప్రతిభ ఉంటుందని వారిని ప్రోత్సహిస్తే అద్భుతాలు సృష్టిస్తారని పేర్కొన్నారు.సైన్ లాంగ్వేజ్ లో జనగణమన పాడిన కలెక్టర్ బృందాన్ని అభినందించారు.స్కిల్ ట్రైనింగ్ ఇచ్చేందుకు కృషి చేస్తున్నట్లు వివరించారు.
యూపీఎస్సీ వంటి ఉన్నత ఉద్యోగాల్లో దివ్యాంగులు రాణిస్తున్నారని.. చదువును నమ్ముకుని ముందుకు సాగాలని సూచించారు. వయో వృద్ధుల దివ్యాంగుల సంక్షేమ శాఖ డైరెక్టర్ శైలజ మాట్లాడుతూమన రాష్ట్రంలో దివ్యాంగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. దివ్యాంగులు ఆత్మస్థైర్యం పెం చుకోవాలని సూచించారు. దివ్యాంగుల సం క్షేమం కోసం కలెక్టర్ చేపడుతున్న చర్యలను అభినందించారు. దివ్యాంగుల కోపరేటివ్ చైర్మన్ వీరయ్య మాట్లాడుతూరాష్ట్ర ప్రభు త్వం దివ్యాంగులతో ఇప్పటికీ స్వయం సహాయక సంఘాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టిం దన్నారు.
40 శాతం వైకల్యం ఉన్న పరికరాలు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు వివరించారు. జిల్లాలోని డిసిబిసి భవన నిర్మాణానికి కృషి చేస్తామన్నారు. అనంతరం అతిథులను అధికారులు, సంక్షే మ సంఘం నాయకులు సన్మానించారు. సందర్భంగా దివ్యాంగులైన విద్యార్థులు ప్రదర్శించిన సంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో జిల్లా సం క్షేమ అధికారి సరస్వతి, మెప్మా పీడీ స్వరూప రాణి, అధికారులు, వికలాంగుల సంక్షేమ సంఘం దివ్యాంగులు పాల్గొన్నారు.
బాలుడి కుటుంబానికి అండగా ఉంటాం
హైదరాబాదులో వీధి కుక్కల దాడిలో గాయపడ్డ బాలుడి కుటుంబానికి అన్ని విధాల అండగా ఉంటామని మంత్రి లక్ష్మణ్ కుమార్ హామీ ఇచ్చారు. అతని కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు, మా శాఖ ద్వారా మెరుగైన వైద్య సేవలు, అది చదువు బాధ్యతలు చూస్తామనిహామీఇచ్చారు.