21-04-2025 12:00:00 AM
మలయాళంలో బాక్సాఫీస్ హిట్ గా నిలిచిన ‘అలప్పజ జింఖానా’ చిత్రం తెలుగులోకి రాబోతున్న విషయం తెలిసిందే. మేక ర్స్ దీన్ని తెలుగులో ‘జింఖానా’ పేరుతో విడుదల చేస్తున్నారు. ‘ప్రేమలు’ ఫేమ్ నస్లెన్ ఇందు లో కథానాయకుడిగా నటిస్తున్నాడు. ఖలీద్ రెహమాన్ స్వీయ దర్శకత్వంలో జాబిన్‌జార్జ్, సమీర్ కారత్, సుభీష్ కన్నంచెరి ఈ స్పోర్ట్స్ డ్రామాకు నిర్మాతలు. లుక్మాన్ అవరన్, గణపతి, బేబీ జీన్, సందీప్ ప్రదీప్, ఫ్రాంకో ఫ్రాన్సిస్ తదితరులు ఇతర పాత్రలు పోషించారు.
నస్లేస్ ‘ప్రేమలు’ తర్వాత నటించిన సినిమా కావడంతో మంచి అంచనాలే ర్పడ్డాయి. ఈ సినిమా ఈ నెల 25న విడుదల కానున్న ఈ సందర్భంగా టాలీవుడ్ దర్శకుడు అనిల్ రావిపూడి ఈ చిత్ర ట్రైలర్‌ను లాంచ్ చేశారు. ట్రైలర్ ఆద్యంతం వినోదాత్మకంగా సాగుతూ ఆకట్టుకుంది.
కొందరు యువకులు బాక్సింగ్ క్లాస్ కోసం సెయిన్ చేయడంతో ట్రైలర్ మొదలైంది. బాక్సింగ్ అంటే పంచ్ లు విసరడమే కాదని, ఇది క్రమశిక్షణ, విల్ పవర్‌తో కూడుకున్నదనే సందేశంతో ట్రైలర్ ముగిసింది.