09-05-2025 03:47:27 PM
సారంగాపూర్ (విజయక్రాంతి): సారంగాపూర్ మండలం(Sarangapur Mandal)లోని వంజర్ గ్రామ సమీపంలోని స్వర్ణ వాగులో (పెద్ద వాగు)లో ప్రమాదవశాత్తూ పడి గ్రామానికి చెందిన చాట్ల లక్ష్మి శుక్రవారం మృతి చెందింది. పోలీసులు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... శుక్రవారం ఉదయం స్వర్ణ వాగు వైపు వెళ్లిన స్థానికులకు నీటిలో మృతదేహం కనిపించింది.
పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటన స్థలానికి చేరుకుని ఎస్సై సల్ల శ్రీకాంత్ తాత్కాలిక రహదారిపై వేసిన నీటి గొట్టాల నుండి మహిళ మృతదేహాన్ని బయటకు తీయించారు. గత కొద్ది కాలంగా లక్ష్మి మతి స్థిమిత వ్యాధితో బాధపడుతుందని, కాల కృత్యాల కోసం వాగు వద్దకు వెళ్ళి ప్రమాదవశాత్తు నీటిలో పడి ఉంటుందని తెలిపారు. సుమారు మూడు రోజుల క్రితం లక్ష్మి చనిపోయినట్లు భావించి మృతదేహం కుల్లిపోవడంతో నిర్మల్ ప్రాంతీయ ఆసుపత్రి వైద్యురాలు గాయత్రి ఘటన స్థలానికి చేరుకుని శవ పంచనామా నిర్వహించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నట్లు సారంగాపూర్ ఎస్సై సల్ల శ్రీకాంత్ తెలిపారు.