calender_icon.png 9 May, 2025 | 9:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

'ఆపరేషన్ సిందూర్'కు మద్దతుగా హనుమకొండలో భారీ ర్యాలీ

09-05-2025 02:53:58 PM

కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు, మాజీ కార్పొరేటర్ బోడ డిన్న.

హనుమకొండ,(విజయక్రాంతి): హనుమకొండ వేయి స్తంభాల గుడి(Thousand Pillar Temple) నుండి హనుమకొండ చౌరస్తా వరకు శుక్రవారంనాడు మాజీ కార్పొరేటర్ బోడ డిన్న ఆధ్వర్యంలో ఆపరేషన్ సింధూర్ కు మద్దతుగా భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగ బోడ డిన్న మాట్లాడుతూ... పాకిస్తాన్ ఉగ్రవాదులు భారతదేశంలో చొరబడి  దొంగ దెబ్బ తీసి  సుమారు 27 మంది భారత పౌరులను హతమార్చి మన దేశ ఆడబిడ్డల సింధూరాన్ని చెరిపేస్తే, నా భారత దేశ ఆడబిడ్డలు త్రివిధ దళాలకు నాయకత్వం వహించిన సోఫియా ఖురేషి, వ్యోమీకా సింగ్ కేవలం ఇద్దరూ పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలను లక్ష్యంగా చేసుకొని కేవలం 25 నిమిషాలలో సుమారు 100 మంది ఉగ్రవాదులను హతమార్చి భారతదేశ సత్తా ఏంటో నిరూపించి పాకిస్తాన్ కు గుణపాఠం చెప్పారు. ఇది నా భారతదేశం అని  వారి గొప్పతనాన్ని కొనియాడుతూ,  భారతదేశ ప్రజలందరూ భారత సైనిక దళాలకు  అండగా నిలవాలని, ఇది ప్రతి ఒక్క భారత పౌరుడి బాధ్యతన్నారు. ఈ కార్యక్రమంలో జనగాని శంకర్, సందీప్ రెడ్డి, ఇక్బాల్ హుస్సేన్, కురషీద్, చెరుకు సందీప్, విశాల్ బాబు, దయాకర్, సాయి, అబేడ్, రాహుల్ తదితరులు పాల్గొన్నారు.