calender_icon.png 9 May, 2025 | 10:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యర్రవరం నర్సింహ స్వామి దేవాలయం వద్ద అన్నదానం

09-05-2025 02:35:42 PM

పీఏసీఎస్ చైర్మన్ నలజాల శ్రీనివాసరావు, కృపారాణి దంపతులు

కోదాడ: మండల పరిధిలోని యర్రవరం బాల ఉగ్ర నరసింహ స్వామి దేవాలయం వద్ద పీఏసీఎస్ చైర్మన్ నలజాల శ్రీనివాసరావు(PACS Chairman Nalajala Srinivasa Rao), కృపారాణి దంపతులు శుక్రవారం 10 వేల మందికి అన్నదానం నిర్వహించారు. స్వామి వారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ కుమార్తె అమెరికాలో ఎం ఎస్ పూర్తిచేసి ఉన్నత ఉద్యోగం సాధించిన సందర్భంగా మొక్కలు తీర్చుకొని, అన్నదానం చేసినట్లు తెలిపారు. ఆలయ కమిటీ చైర్మన్ నలజాల జగన్నాధం, నాగేశ్వరరావు, రావుల వెంకటేశ్వర్లు, నలజాల కొండల్ కోదాడ మాజీ కౌన్సిలర్ సుబ్బారావు సాతులూరి భాస్కర్ రావు, సుదర్శన్ పాల్గొన్నారు.