09-05-2025 02:32:26 PM
బెల్లంపల్లి అర్బన్,(విజయక్రాంతి): ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ గృహ పథకం అర్హులకే ఇవ్వాలని సీపీఐ నాయకులు(CPI leaders) డిమాండ్ చేశారు. శుక్రవారం బెల్లంపల్లి ఆర్డీవో హరికృష్ణ, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావుకు వినతి పత్రం అందజేశారు.తెలంగాణ గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకo అర్హులైన వారికే చెందాలని సీపీఐ బెల్లంపల్లి పట్టణ సమితి కార్యదర్శి ఆడెపు రాజమౌళి, సీనియర్ నాయకులు జిల్లా కార్యవర్గ సభ్యులు చిప్ప నరసయ్య(Chippa Narsaiah) డిమాండ్ చేశారు. బెల్లంపల్లి లోని 34 వార్డులలో వార్డు సభలు నిర్వహించి పేదలను గుర్తించి అసలైన లబ్ధిదారులను ఎంపిక చేయాలన్నారు.
కానీ వార్డు సభలు పెట్టకుండా కొంతమంది నాయకులు ఇష్ట రాజ్యoగా వారి అనుచరులకు పక్కా ఇల్లు ఉన్నవారికి కూడా ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తున్నారని అరోపించారు. లబ్ధిదారుల ఎంపిక నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్నట్టు తమ దృష్టికి వచ్చిన్నారు. పట్టణంలోని 34 వార్డులలోసభలు పెట్టించి అర్హులైన వారిని గుర్తించి జాబితాను ప్రకటించానీ కోరారు. ఎంపిక చేసిన అట్టి జాబితాను మున్సిపల్ ఆఫీసులో నోటీసు బోర్డులో అంటించాలన్నారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి మండల సీపీ ఐ కార్యదర్శి బొంతల లక్ష్మీనారాయణ, పట్టణ కార్యవర్గ సభ్యులు బొంకూరీ రామచందర్, కుందేళ్ళ శంకర్, శనిగారపు రాజేందర్, నాయకులు కలువల రాయమల్లు, కొత్తూరు కుమారస్వామి, చెప్పకుర్తి బాపు, పోతారం లింగయ్య, అంబాల మత్తయ్య పాల్గొన్నారు.