calender_icon.png 9 May, 2025 | 8:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫ్రెండూ.. అస్సల్ తగ్గక్ అట్నే ఉండు..

21-04-2025 12:00:00 AM

ధనుష్, నాగార్జున, రష్మిక మందన్నా, జిమ్ సార్బ్ వంటి ప్రముఖ తారాగాణంతో  దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న చిత్రం ‘కుబేర’. శ్రీవేంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పీ, అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమి టెడ్ పతాకాలపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్‌మోహన్‌రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భావోద్వేగాలే ప్రధానంగా ఆకట్టుకునే డ్రామా, గ్రాండ్ విజువల్స్‌తో రూపుదిద్దుకుంటున్న బహుభాషా ప్రాజెక్ట్ ఇది. తమిళం, తెలు గు భాషల్లో ఏకకాలంలో చిత్రీకరించబడుతున్న ఈ సినిమా హిందీ, కన్నడ, మలయాళ వెర్షన్లలో ప్రేక్షకుల ముందుకు రానుం ది.

జూన్ 20న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానున్న ఈ చిత్రం నుంచి తాజాగా ఫస్ట్ సింగిల్ ‘పోయ్‌రా మామా’ను మేకర్స్ రిలీజ్ చేశారు. ‘వన్‌డే హీరో నువ్వే ఫ్రెం డూ.. నీకోసమే డప్పుల్ సౌండు.. అస్సల్ తగ్గక్ అట్నే ఉండు.. మొక్కుతారు కాళ్లు రెండూ.. నిన్నే చూస్తున్నాది చూడు ఊరు మొత్తం దేవుల్లాగా.. వన్‌వేలోనా నువ్వెళ్లినా.. ఆపర్ నిన్నూ అందర్లాగా.. రథం మీద నువ్వే అలాగా..

దూసుకెళ్తా ఉంటే అబ్బో యమాగా.. సీఎం పీఎం వచ్చినా నువ్వు సలాం కొట్టే పనే లేదు గా.. ముందట్లాగా అంతీజీగా నిన్నే కల్సుకోలేరుగా.. నీతో ఫొటో దిగాలన్నా సచ్చేటంతా పనవుతుందిగా.. పోయ్‌రా పోయ్‌రా పోయ్ రా మామా.. అరె రాజాలాగా దర్జాగా పోయ్‌రా మామా..’ అంటూ సాగుతోందీ పాట. భాస్కరభట్ల సాహిత్యం అందించగా.. దేవిశ్రీ ప్రసాద్ సంగీత సారథ్యంలో హీరో ధనుష్ స్వయంగా ఈ పాటను పాడటం విశేషం.