16 April, 2026 | 1:47 AM

దక్షిణ అండమాన్‌లో అల్పపీడనం

23-11-2025 12:00 AM

రెండు రోజులు తేలికపాటి వర్షాలు

హైదరాబాద్, నవంబర్ 22 (విజయక్రాంతి): మలక్కా అండమాన్ సముద్రం మధ్య అల్పపీడనం ఏర్పడింది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణించి ఈనెల 24న ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే అవకాశమున్నట్లుగా వాతావరణ శాఖ తెలిపింది. ఈక్రమంలో రాయలసీమ, కోస్తాంధ్ర జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. 48 గంటల్లో దక్షిణకోస్తా, రాయలసీమలో ఓ మోస్త్తరు వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది.

అండమాన్ సముద్రంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం తెలంగాణపై కూడా పడనుంది. ఈక్రమంలోనే రాష్ట్రంలో రానున్న రెండు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఆదివారం, సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది