15 June, 2026 | 8:42 PM

Breaking News

అధికారులను సమన్వయం చేసుకోలేని దద్దమ్మ రేవంత్ రెడ్డి   •   రెడ్లకుంట ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా 'బడి బాట'   •   హుస్నాబాద్ ఇంజనీరింగ్ కళాశాలలోనే భవిష్యత్తుకు బలమైన పునాది!   •   పాము కాటుతో మృతి చెందిన రాజేశ్వర్ కుటుంబానికి ఆర్థిక సహాయం   •   ఇందిరమ్మ గృహాలను పరిశీలించిన చీఫ్ ఇంజనీర్   •   భారీ వర్షాల నేపథ్యంలో వరద నీరు నిల్వ ఉండకుండా ముందస్తు చర్యల కోసం అధికారుల పర్యటన   •   ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించాలి   •   రేపు పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేత   •   అవినీతి పాల్పడిన జెడ్పీ సీనియర్ అసిస్టెంట్‌పై సస్పెన్షన్ వేటు   •   వెంకట్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే పద్మావతి   •  

వెట్టుయాన్‌లో నటరాజ్‌గా..

19-09-2024 12:50 AM

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటిస్తున్న ‘వెట్టుయాన్’ సినిమా పాన్ -ఇండియన్ స్థాయిలో విడుదలకు సిద్ధమైంది. ప్రస్తుతం ఇండస్ట్రీ మొత్తం ఎదురుచూస్తున్న ఈ సినిమాను కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నాడు. అమితాబ్ బచ్చన్, ఫహద్ ఫాసిల్, రానా దగ్గుబాటి, మంజు వారియర్, కిషోర్, రితికా సింగ్, దుషార విజయన్, అభిరామి, రోహిణి, రావు రమేశ్, రమేశ్ తిలక్, రక్షణ ఇలా సినిమాలో ప్రముఖ స్టార్స్‌ను రంగంలోకి దించుతున్నాడు డైరెక్టర్. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకొంటున్న ఈ సినిమా సెట్‌లో రానా దగ్గుబాటి అడుగుపెట్టాడు.

తాజాగా రానా మేకింగ్ వీడియోను మేకర్స్ రిలీజ్ చేస్తూ.. అతని పాత్రను పరిచయం చేశారు. రానా ఇందులో ‘నటరాజ్’ అనే పాత్రలో కనిపించనున్నాడు. ఇక ఈ మేకింగ్ వీడియోలో రానా లుక్ నెక్స్ట్ లెవల్‌లో ఉంది. చివరి షాట్‌లో రజినీని రానా ఇంటర్వ్యూ చేస్తూ కనిపించారు. అంటే ఇందులో రానా ఒక ఛానెల్‌కు హెడ్‌గా చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ వీడియోతో రానా క్యారెక్టర్‌పై అంచనాలు పెరిగిపోయాయి. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ సినిమానే కాకుండా రానా చేతిలో ‘రానా నాయుడు 2’ ఉంది. కాగా, రానా ప్రస్తుతానికి ఎక్కువ నిర్మాణ రంగంపైనే ఫోకస్ చేస్తున్నారు.